కల్యాణ్ రామ్ వాళ్లిద్దరిని ఢీ కొట్టనున్నాడా!!!

నందమూరి వారసుడు కళ్యాణ రామ్ పాటాస్ సినిమా సంక్రాంతికి హల్‌చల్ చేయనుంది అన్న వార్తలు టాలీవుడ్ లో చక్కెర్లు కొడుతున్నాయి.అసలైతే బాలయ్య లయన్ కానీ, ఎన్టీఆర్ టెంపర్ కానీ, రెండింటిలో ఏదో ఒకటి సంక్రాంతి బరిలో నిలుస్తుంది అని నందమూరి అభిమానులు అంతా ఆశపడ్డారు.

 Pataas Release On January12th-TeluguStop.com

ఇక ఎన్టీఆర్ సైతం టెంపర్ ని సంక్రాంతి కానుకగా అభిమానులకు అందించాలి అని చాలా కసరత్తె చేశాడు, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల బాలయ్యా, మరియు ఎన్టీఆర్ ఇద్దరు ఫిబ్రవరిలోనే బాక్స్ ఆఫీస్ ని పలకరించనున్నారు అని తెలుస్తుంది.అయితే ఆ ఆశని తీరుస్తాను అని అంటున్నాడు కల్యాణ్ రామ్.

ఇప్పటి దాకా పవన్ ‘గోపాల గోపాల’ విక్రమ్ ‘ఐ’ లమధ్య రసవత్తరంగా జరుగుతున్న సంక్రాంతి పోటీ మధ్య కళ్యాణ్ రామ్ ‘పటాస్’ సందడి చేస్తుంది అని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.ఇప్పటి దాకా ఈనెల 9న విడుదల అవుతుంది అనుకున్న పవన్ గోపాలుడు 11వ తారీఖుకు వాయిదా పడుతుంది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ‘గోపాల గోపాల’ విడుదలైన తరువాత ఒకరోజు గ్యాప్ తో కళ్యాణ్ రామ్ ‘పటాస్’ విడుదల 12వ తారీఖున ఉండబోతోంది అని తెలుస్తుంది.

అయితే మరో ఆసక్తికర విషయం ఏమిటంటే పాటాస్ లో జూనియర్ వాయస్ ఓవర్ కాని లేదంటే ఒక్క నిముషం కనిపించే పాత్రలో నటించడం కాని నందమూరి అభిమానులకు ఆశ్చర్యపరిచే విధంగా ఉంటుందని లేటెస్ట్ గాసిప్ లు మొదలయ్యాయి.ఇక ఇప్పటికే ‘పటాస్’ టీజర్ కు పాజిటివ్ టాక్ వచ్చిన నేపధ్యంలో కళ్యాణ్ రామ్ ఈ సాహసం చేస్తున్నాడు అని అభిమానులు అంతా ఆశ్చర్యంతో ఎదురుచూస్తున్నారు.

మరి ఇలాంటి భారీ సినిమాల మధ్య పాటాస్ ఎంతవరకు పేలుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube