సినిమా ఇండస్ట్రీలోనే బోయపాటి శ్రీనుకి ( Boyapati Srinu )మాస్ డైరెక్టర్ గా చాలా మంచి గుర్తింపు అయితే ఉంది.ఇక ప్రస్తుతం ఆయన బాలయ్య బాబుతో ఒక సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు సూపర్ సక్సెస్ అవ్వడంతో నాలుగో సినిమా మీద కూడా భారీ అంచనాలైతే ఉన్నాయి.మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఆయన సినిమాను చేసి సూపర్ సక్సెస్ గా నిలుపుతాడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
మరి మొత్తానికైతే బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్ళబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.ఇక ఇదిలా ఉంటే అక్టోబర్ 10వ తేదీ ఉదయం 10 గంటలకు ఈ సినిమాకి సంబంధించిన ముహూర్తాన్ని కూడా చేపట్టబోతున్నట్టుగా ఒక పోస్టర్ లో బోయపాటి శ్రీను తెలియజేసారు.మరి మొత్తానికైతే ఈ సినిమాని సూపర్ సక్సెస్ గా నిలపడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది.ఈ సినిమా సక్సెస్ అయితే వరుసగా నాలుగో సక్సెస్ ని సాధించినవాడుగా గుర్తింపును సంపాదించుకుంటాడు.
ఇక మొత్తానికైతే బోయపాటి శ్రీను ప్రస్తుతం వరుస ప్లాపుల్లో ఉన్నాడు.మరి ఆయన కనక ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తేనే తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ అయితే క్రియేట్ అవుతుంది.లేకపోతే మాత్రం ఫేడ్ ఔట్ దర్శకుల లిస్టులో ఆయన పేరు కూడా నిలిచే అవకాశాలైతే ఉన్నాయి… ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు బోయపాటికి మధ్య మంచి కాంబినేషన్ కుదరడంతో ఈ సినిమాతో ఆయన మరో సక్సెస్ ని సాధిస్తాడనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది…
.