అమెరికా అధ్యక్ష ఎన్నికలు : కమల, ట్రంప్‌లలో గెలుపెవరిది.. యూఎస్ నోస్ట్రాడమస్ ఏం చెప్పారంటే?

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రిపబ్లికన్లు, డెమొక్రాట్లు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.ఓటర్లను ఆకట్టుకునేందుకు ఏ చిన్న అవకాశాన్ని వారు విడిచిపెట్టడం లేదు.

 Nostradamus Of Us Polls Predictions For Us Presidential Polls 2024 Details, Nost-TeluguStop.com

కమలా హారిస్,( Kamala Harris ) డొనాల్డ్ ట్రంప్‌లలో( Donald Trump ) అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ఎవరు అంటూ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.ఈ నేపథ్యంలో అమెరికా నోస్ట్రాడామస్‌గా( US Nostradamus ) గుర్తింపు తెచ్చుకున్న ఓ వ్యక్తి షాకింగ్ కామెంట్స్ చేశాడు.

యూఎస్ పోలింగ్ నోస్ట్రాడమస్‌గా అభివర్ణించే చరిత్రకారుడు అలన్ లిచ్ట్‌మన్.( Allan Lichtman ) డొనాల్డ్ ట్రంప్‌పై కమలా హారిస్ విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు.77 ఏళ్ల లిచ్ట్‌మన్ సీఎన్ఎన్‌కు చెందిన మైఖేల్ స్మెర్‌కోనిష్‌కి ఈ విషయం ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

Telugu Allan Lichtman, Democrats, Donald Trump, Kamala Harris, Nostradamus, Repu

గడిచిన కొన్ని దశాబ్ధాలుగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు లిచ్ట్‌మాన్ జోస్యానికి దగ్గరగా వచ్చాయి.దీంతో ఆయనను నోస్ట్రాడమస్ ఆఫ్ యూఎస్ ప్రెసిడెంట్ పోల్స్‌గా అభివర్ణిస్తారు.గతంలో అమెరికన్ యూనివర్సిటీలో హిస్టరీ ప్రొఫెసర్‌గా లిచ్ట్‌మాన్ పనిచేశారు.

ఒక్క 1984 అమెరికా అధ్యక్ష ఎన్నికలు( US Presidential Elections ) తప్పించి మిగిలిన అన్నిసార్లు ఆయన చెప్పిన జోస్యాలు ఫలించాయి.దీనిలో భాగంగా ఈసారి కమలా హారిస్ గెలుస్తుందని లిచ్ట్‌మాన్ తెలిపారు.

పోలింగ్ ముందు చివరి నెల గేమ్‌ ఛేంజర్‌గా మారుతుందని ఆయన వెల్లడించారు.

Telugu Allan Lichtman, Democrats, Donald Trump, Kamala Harris, Nostradamus, Repu

అమెరికా రాజకీయాల్లో చర్చనీయాంశమైన అక్టోబర్ సర్‌ప్రైజ్ ఈసారి కమలా హారిస్ విజయాన్ని అడ్డుకోలేదని లిచ్ట్‌మాన్ అన్నారు.అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందుగా వచ్చే అక్టోబర్ నెలలో ఆ దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి.1980 అధ్యక్ష ఎన్నికల సమయంలో జిమ్మీ కార్టర్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇరాన్‌లోని అమెరికన్ బందీలను విడుదల కోసం ఆయన పోరాడారు.నాటి నుంచి అక్టోబర్ సర్‌ప్రైజ్( October Surprise ) అనే పదం పాపులర్ అయ్యింది.హిల్లరీ క్లింటన్ ఈ మెయిల్స్‌పై విచారణ, 2020 ఎన్నికలకు ముందు హంటర్ బైడెన్ ల్యాప్‌టాప్ చుట్టూ వివాదం ఇవన్నీ అక్టోబర్‌లోనే సంభవించాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube