రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి.వలస పాలన నుంచి భారతదేశం స్వేచ్ఛావాయువులు పీల్చుకునేలా పోరాటాన్ని నడిపించారు జాతిపిత మహాత్మాగాంధీ.
( Mahatma Gandhi ) ఓ సామాన్యుడిలా జీవితాన్ని ప్రారంభించిన గాంధీ… తర్వాతి రోజుల్లో మహాత్ముడిగా మారారు.సత్యాగ్రహం, అహింస అనే ఆయుధాలతోనే తెల్లదొరలను దేశం నుంచి తరిమికొట్టారు బాపూజీ.
ఒక్క భారతావనికే కాకుండా ప్రపంచం మొత్తానికి స్ఫూర్తిగా నిలిచిన మహోన్నత వ్యక్తి గాంధీ.మహాత్ముడికి భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్నారు.
ఎన్నో దేశాల్లో వీధి వీధినా ఆయన విగ్రహాలు వున్నాయి.శాంతికే ప్రతిరూపమైన బాపూజీ మార్గాన్ని నాటి నుంచి నేటి వరకు ఎందరో దేశాధినేతలు, సంఘసంస్కర్తలు, ప్రజాస్వామ వాదులు అనుసరించారు.
అక్టోబర్ 2న గాంధీ జయంతి( Gandhi Jayanthi ) సందర్భంగా జాతి ఆయనకు ఘన నివాళులర్పించింది.మనదేశంతో పాటు పలు దేశాల్లో బాపూజీ జయంతి వేడుకలు జరిగాయి.చైనా రాజధాని బీజింగ్‌లోని( Beijing ) భారత రాయబార కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో గాంధీజీకి నివాళుర్పించారు.చైనాలోని భారత రాయబారి ప్రదీప్ కుమార్ రావత్( Pradeep Kumar Rawat ) నేతృత్వంలోని భారతీయ దౌత్యవేత్తలు, మాల్దీవుల్లోని చైనా రాయబారి ఫజీల్ నజీబ్, బీజింగ్‌కు చెందిన భారతీయ ప్రవాసులు , గాంధీ అభిమానులు ఆయనకు నివాళుర్పించారు.
చైనాలోని( China ) చాయాంగ్ పార్క్‌లో( Chaoyang Park ) జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్ధులు మాండరిన్ భాషలో గాంధీ బోధనలను పఠించారు.బీజింగ్‌కు చెందిన పలువురు నృత్యకారులు ఒడిస్సీ నృత్యాన్ని ప్రదర్శించారు.అహింసా : ది గాంధీ వే అనే నాటకాన్ని స్థానిక ఇండియన్ కమ్యూనిటీ ప్రదర్శించింది.కెట్కీ థాకర్, ఆయుషి సుగంధి దీనికి రచన, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు.
బీజింగ్‌లోనే ఫేమస్ డెస్టినేషన్ స్పాట్‌లలో ఒకటైన చాయోయాంగ్ పార్క్‌లో చైనీస్ శిల్పి యువాన్ జికున్ చేతుల్లో రూపుదిద్దుకున్న గాంధీ విగ్రహాన్ని 2005లో ప్రతిష్టించారు.గాంధీజీ, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (పీఆర్సీ) స్థాపకుడు మావో జెడాంగ్ వేర్వేరు సిద్ధాంతాలతో స్వాతంత్ర్య పోరాటాలకు నాయకత్వం వహించారు.1947లో భారత్‌కు స్వాతంత్ర్యం రాగా.1949లో చైనాలో మావో నేతృత్వంలో పీఆర్సీ ఏర్పడింది.