కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు కీలక నిర్ణయం

బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ ( Congress )లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల పైన అనర్హత విషయంలో నాలుగు వారాల్లోగా షెడ్యూల్ విడుదల చేయాలని,  20 రోజుల క్రితమే హైకోర్టు సింగల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.

 High Court Decision On Disqualification Of Congress Mlas, Brs, Bjp, Congress, Da-TeluguStop.com

అయితే ఈ ఆదేశాల పైన అసెంబ్లీ కార్యదర్శి స్టేటస్ కోరుతూ హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు .ఈ స్టేటస్ పై హైకోర్టు డివిజన్ బెంచ్ మధ్యంతర ఆదేశాలు ఇచ్చేందుకు నిరాకరించింది.  ఎమ్మెల్యేల అనర్హత పైన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై హైకోర్టు తీర్పు వెలువరించింది.పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేసేలా అసెంబ్లీ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు సింగిల్ బెంచ్ అసెంబ్లీ కార్యదర్శి ఆదేశాలు ఇచ్చింది .

Telugu Congress, Danam Nagendar, Congress Mlas, Kadiyam Srihari, Telangana Hiegh

అనర్హత పిటిషన్లను అసెంబ్లీ స్పీకర్ ముందు ఉంచాలని స్పష్టం చేసింది .  బీఆర్ఎస్ ( BRS )నుంచి కాంగ్రెస్ లో చేరిన వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది .దీనిపైన విచారించిన హైకోర్టు కీలక ఆదేశాలు( High Court ) ఇచ్చింది .విచారణ పైన షెడ్యూల్ విడుదల చేయాలని,  ఈ సమాచారం ఇస్తూ నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.  ఫిర్యాదు చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు,  పార్టీ మారిన మిగిలిన ఎమ్మెల్యేల కు ఈ ఆదేశాలు వర్తిస్తాయని చెబుతున్నారు.

Telugu Congress, Danam Nagendar, Congress Mlas, Kadiyam Srihari, Telangana Hiegh

ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఖైరతాబాద్,  తెల్లం వెంకట్రావు భద్రాచలంపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి,  కేపీ వివేకానంద ( MLAs Padi Kaushik Reddy, KP Vivekananda )పిటిషన్ దాఖలు చేశారు.  హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై అసెంబ్లీ కార్యదర్శి హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించగా , మద్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని ఈనెల 24న వాదనలు వింటామని హైకోర్టు డివిజన్ బెంజ్ పేర్కొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube