టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) హీరోగా నటించిన తాజా చిత్రం దేవర( Devara ).కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా తాజాగా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ను అందుకోవడంతోపాటు కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.
ప్రస్తుతం థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా ఆడుతూ దూసుకుపోతోంది దేవరా మూవీ.ఈ సినిమా విడుదల అయ్యి వారం రోజులు అవుతున్నా కూడా కలెక్షన్ల జోరు ఏ మాత్రం తగ్గడం లేదు.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో రికార్డ్ కలెక్షన్స్ దిశగా పరుగులు పెడుతోంది.ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
రెండు పాత్రలలో నటించిన ఎన్టీఆర్ కథని తన భుజాలపై వేసుకొని నడిపించాడని ఆడియన్స్ అంటున్నారు.కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.ఇకపోతే ఈ సినిమా విడుదల అయ్యి నేటికీ ఏడు రోజులు కావస్తోంది.మరి ఈ సందర్భంగా ఈ సినిమా ఆరవ రోజు కలెక్షన్లు ఏ విధంగా ఉన్నాయో,ఏ ప్రదేశంలో ఎంతెంత కలెక్షన్ లు వచ్చాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.తెలుగు రాష్ట్రాలలో 4, 5 వ రోజులలో 5+ కోట్ల షేర్ కలెక్షన్స్ ఈ మూవీ అందుకుంటే 6వ రోజు ఏకంగా 8.39 కోట్ల షేర్ రావడం విశేషం.
దీనిని బట్టి సినిమాకి ఏ రేంజ్ లో ఆదరణ లభించిందో అర్ధం చేసుకోవచ్చు.ఆంధ్రా, నైజాం, సీడెడ్ ( Andhra, Nizam, seeded )లలో ఎక్కడా కూడా సినిమాకి ప్రేక్షకాదరణ తగ్గడం లేదు.6వ రోజు ఏరియాల వారీ వచ్చిన కలెక్షన్స్ చూస్తుంటే ఇది స్పష్టంగా తెలుస్తోంది.నైజాంలో 6వ రోజు దేవరకి 3.71 కోట్ల షేర్ వచ్చింది.అలాగే సీడెడ్ లో 1.63 కోట్ల షేర్ రావడం విశేషం.ఇక వైజాగ్ లో 98 లక్షలు, తూర్పు గోదావరిలో 42 లక్షలు, పశ్చిమ గోదావరిలో 33 లక్షల షేర్ వచ్చింది.
కృష్ణా జిల్లాలో 49 లక్షలు, గుంటూరులో 46 లక్షలు, నెల్లూరులో 37 లక్షల షేర్ ఈ సినిమా వసూళ్లు చేసింది.ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో ఆరు రోజుల కలెక్షన్స్ చూసుకుంటే 107.03 కోట్ల షేర్ ఉంది.ఆల్ మోస్ట్ మూడు ఏరియాలలో బ్రేక్ ఈవెన్ టార్గెట్ దగ్గరకి కలెక్షన్స్ వచ్చేసాయి.
దసరా ఫెస్టివల్ హాలిడేస్ కూడా కలిసిరాకున్న నేపథ్యంలో మూవీ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.