సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న చిరంజీవి( Chiranjeevi ) ఇంటి నుంచి ఎంతోమంది హీరోలుగా నిర్మాతలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఇలా ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా కొనసాగుతున్న వారిలో నిహారిక( Niharika ) ఒకరు.
ఈమె యాంకర్ గా తన కెరియర్ ప్రారంభించారు అనంతరం హీరోయిన్గా పలు సినిమాలలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమాల ద్వారా నిహారిక సక్సెస్ అందుకోలేకపోయారు.ఇక పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లిన ఈమె తన వైవాహిక జీవితంలో కూడా సక్సెస్ అందుకోలేకపోయారు.
ఇలా తన భర్తకు విడాకులు ఇచ్చి ఈమె తిరిగి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.ప్రస్తుతం నిర్మాతగా నటిగా వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పట్ల బిజీగా ఉన్నారు.ఇలా నిహారిక నిర్మాతగా చేసిన కమిటీ కుర్రాళ్లు( Committee Kurrollu ) సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.ఇలా మొదటి సినిమాతోనే నిర్మాతగా కూడా నిహారిక సక్సెస్ అందుకున్నారు.
ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమె పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
తాను యాంకర్ గా ఇండస్ట్రీలోకి రాకముందే బాలనటిగా( Child Artist ) కూడా ఒక సినిమాలో నటించాను అనే విషయాన్ని వెల్లడించారు.ఆ సినిమా కూడా తన పెదనాన్న చిరంజీవి నటించినది కావటం విశేషం.ఇలా చిరంజీవి గారు నటించిన సినిమాలో తాను బాలనటిగా నటించానని అయితే కొన్ని కారణాలవల్ల ఆ సినిమాలో నా పాత్ర తొలగించారని నిహారిక వెల్లడించారు.
మరి చిరంజీవితో కలిసి బాలనటిగా నిహారిక నటించిన చిత్రం అంజి( Anji ) .ఈ సినిమాలో చిన్న పిల్లల పాత్రకు మంచి డిమాండ్ ఉంది అయితే నిహారిక కూడా బాలనటిగా నటించిన తన పాత్రను తొలగించారని తెలిపారు.ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిందని చెప్పాలి.