చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన నిహారిక.. ఆ సినిమా ఏంటో తెలుసా?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న చిరంజీవి( Chiranjeevi ) ఇంటి నుంచి ఎంతోమంది హీరోలుగా నిర్మాతలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ఇలా ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా కొనసాగుతున్న వారిలో నిహారిక( Niharika ) ఒకరు.ఈమె యాంకర్ గా తన కెరియర్ ప్రారంభించారు అనంతరం హీరోయిన్గా పలు సినిమాలలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమాల ద్వారా నిహారిక సక్సెస్ అందుకోలేకపోయారు.

ఇక పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లిన ఈమె తన వైవాహిక జీవితంలో కూడా సక్సెస్ అందుకోలేకపోయారు.

"""/" / ఇలా తన భర్తకు విడాకులు ఇచ్చి ఈమె తిరిగి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

ప్రస్తుతం నిర్మాతగా నటిగా వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పట్ల బిజీగా ఉన్నారు.

ఇలా నిహారిక నిర్మాతగా చేసిన కమిటీ కుర్రాళ్లు( Committee Kurrollu ) సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇలా మొదటి సినిమాతోనే నిర్మాతగా కూడా నిహారిక సక్సెస్ అందుకున్నారు.ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమె పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

"""/" / తాను యాంకర్ గా ఇండస్ట్రీలోకి రాకముందే బాలనటిగా( Child Artist ) కూడా ఒక సినిమాలో నటించాను అనే విషయాన్ని వెల్లడించారు.

ఆ సినిమా కూడా తన పెదనాన్న చిరంజీవి నటించినది కావటం విశేషం.ఇలా చిరంజీవి గారు నటించిన సినిమాలో తాను బాలనటిగా నటించానని అయితే కొన్ని కారణాలవల్ల ఆ సినిమాలో నా పాత్ర తొలగించారని నిహారిక వెల్లడించారు.

మరి చిరంజీవితో కలిసి బాలనటిగా నిహారిక నటించిన చిత్రం అంజి( Anji ) .

ఈ సినిమాలో చిన్న పిల్లల పాత్రకు మంచి డిమాండ్ ఉంది అయితే నిహారిక కూడా బాలనటిగా నటించిన తన పాత్రను తొలగించారని తెలిపారు.

ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిందని చెప్పాలి.

టాలీవుడ్ హీరోయిన్లకు ఉన్న క్రేజీ వీక్నెస్‌లు ఇవే !