అమెరికాలో తెలుగు విద్యార్ధి మృతి, డిసెంబర్‌లో పెళ్లి.. అంతలోనే ఘోరం

ఉన్నత విద్య కోసం అమెరికాకు( America ) వెళ్లిన భారతీయ విద్యార్ధుల అకాల మరణాలు, హత్యలు, అదృశ్యాలకు ఏమాత్రం అడ్డుకట్ట పడటం లేదు.తాజాగా అగ్రరాజ్యంలో మరో భారతీయ విద్యార్ధి ప్రాణాలు కోల్పోయాడు.

 Telugu Student Akshith Reddy Dies In Us Details, Telugu Student Died, Akshith Re-TeluguStop.com

హైదరాబాద్ కాటేదాన్‌కు చెందిన అక్షిత్ రెడ్డి (26)( Akshith Reddy ) అనే యువకుడు చికాగో( Chicago ) నగరంలోని ఓ చెరువులో ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు.అక్షిత్ చికాగోలో ఉంటూ ఎమ్మెస్ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నాడు.

డిసెంబర్‌లో పెళ్లి చేయాలని ఏర్పాట్లు చేస్తుండగా అతని మరణవార్త తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Telugu Akshith Reddy, Akshithreddy, America Telugu, Chicago, Gopal Reddy, Hydera

మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకులకు చెందిన గోపాల్ రెడ్డి, సమంత దంపతులు పాతికేళ్ల క్రితం హైదరాబాద్( Hyderabad ) రాజేంద్రనగర్ శివార్లలోని కాటేదాన్‌కు వచ్చి స్థిరపడ్డారు.వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు.గోపాల్ రెడ్డి( Gopal Reddy ) డీసీఎం డ్రైవర్‌గా పనిచేస్తూ అక్షిత్ రెడ్డిని ఉన్నత చదువులు చదివించారు.

గత శనివారం సాయంత్రం అతను తన స్నేహితులతో కలిసి చికాగోలోని లేక్‌ మిచిగన్‌‌లో( Lake Michigan ) ఈతకు వెళ్లాడు.ఈ నేపథ్యంలో స్నేహితులతో ఈతలో పోటీపడుతూ అలిసిపోయిన అక్షిత్ మధ్యలోనే మునిగిపోయాడు.

మరో వ్యక్తి కూడా చెరువులో మునిగిపోగా.స్థానికులు కాపాడారు.

సమాచారం అందుకున్న పోలీసులు చెరువులో గాలించి అక్షిత్ రెడ్డి మృతదేహాన్ని వెలికితీశారు.శనివారం రాత్రి అతని భౌతికకాయం హైదరాబాద్ చేరుకోగా.

ఆదివారం అక్షిత్ రెడ్డి స్వగ్రామం అడ్డాకులలో అంత్యక్రియలు పూర్తి చేశారు.

Telugu Akshith Reddy, Akshithreddy, America Telugu, Chicago, Gopal Reddy, Hydera

ఇకపోతే.గతవారం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గద్దె సాయి సూర్య అవినాష్ (26) న్యూయార్క్ నగర సమీపంలోని అల్బానీ ప్రాంతంలో ఉన్న బార్బర్‌విల్లీ జలపాతంలో మునిగి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.నీటి ఉదృతికి అవినాష్ కాలుజారి జలపాతంలో కొట్టుకుపోయాడు.

అతడిని రక్షించేందుకు మరొకరు నీటిలో దూకగా అతను కూడా కొట్టుకుపోయాడు.అయితే రెస్క్యూ సిబ్బంది వేగంగా స్పందించడంతో సదరు వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు.

అవినాష్ స్వగ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండం చిట్యాల గ్రామం.ఇతను ఎంఎస్ చేయడానికి గతేడాది అమెరికా వెళ్లినట్లుగా తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube