మంగళవారం కాలిఫోర్నియాలోని సన్నీవేల్‌లో జరిగిన ‘‘ హిమాచలీ నైట్ ’’( Himachali Nite ) కార్యక్రమానికి భారత సంతతికి చెందిన ప్రజలు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ గొప్పతనాన్ని ప్రదర్శించారు.
బే ఏరియా నలుమూలల నుంచి వచ్చిన హిమాచలీ, హిమాచలీయేతర కమ్యూనిటీ సభ్యులు ఈ కార్యక్రమాన్ని ప్రశసించారు.రాష్ట్ర సంస్కృతిని అన్ని రంగులలో ప్రదర్శించడానికి , డయాస్పోరాలోని పిల్లలు వారి మూలాలతో కనెక్ట్ కావడానికి ఇది అద్భుతమైన అవకాశంగా వారు అభివర్ణించారు.
ఈ కార్యక్రమంలో చిన్నారుల పహాడీ నృత్యం, కళాకారులు పాడిన పహాడీ పాటలు ఆకట్టుకున్నాయి. బే ఏరియా నాటి గ్రూప్ ప్రదర్శించిన నట్టి కూడా అలరించింది.
ఈవెంట్ సందర్భంగా జరిగిన ఫ్యాషన్ షోలో హిమాచలీ నేత ఆందాలను కూడా ప్రదర్శించారు.సాంప్రదాయ హిమాచలీ ధామ్‌ను అతిథులకు వడ్డించారు.
అలాగే లైవ్ సిద్ధూ స్టేషన్ కార్యక్రమంలో మరింత ఉత్సాహాన్ని నింపింది.
మా మాతృభూమికి దూరంగా వున్నప్పటికీ ఎన్నారైలుగా మన మనసుల్లో హిమాచల్ వుంటుందని ఈ ఈవెంట్‌కు నాయకత్వం వహించిన వంశిక పర్మార్ చెప్పారు.ఆర్గనైజింట్ టీమ్ సభ్యులు భావన సత్య, వైశాలి వర్మ, షిప్రా బుటైల్, ప్రణవ్ సుద్, కిరణ్ గులేరియా, నమృతా యుహాన్నాలు కార్యక్రమం సక్సెస్ కావడానికి శ్రమించారని వంశిక అన్నారు.ప్రాచీనమైన రాష్ట్ర వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని.
అమెరికాలో పుట్టి పెరిగిన మా పిల్లలకు హిమాచల్ ప్రదేశ్ సంప్రదాయాలు( Himachal Pradesh Culture ) తెలియాలన్నదే తమ ఆకాంక్ష అని వంశిక అన్నారు.
కాగా.ఈ నెల 15న హిమాచల్ ప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం ‘‘హిమాచల్ డే’’( Himachal Day )ను రాష్ట్రంతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో స్థిరపడిన హిమాచల్ వాసులు ఘనంగా జరుపుకున్నారు.ప్రతి యేటా ఏప్రిల్ 15న హిమాచల్ దినోత్సవాన్ని ఆ రాష్ట్ర ప్రజలు ఘనంగా జరుపుకుంటారు.
హిమాచల్ ప్రదేశ్ 1948లో భారతదేశంలో ఉనికిలోకి వచ్చింది.స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 28 చిన్న సంస్థానాలను విలీనం చేసి హిమాచల్ ప్రదేశ్ ప్రావిన్స్‌గా ఏర్పాటు చేసింది పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వం.
హిమాచల్ డేను అక్కడ సెలవుదినంగా పరిగణిస్తారు.ఈ రోజున రాష్ట్ర రాజధాని సిమ్లాలో గ్రాండ్ పరేడ్‌తో పాటు పట్టణాలు, గ్రామాలలో సాంస్కృతి కార్యక్రమాలు( Cultural Events ) ఘనంగా జరుగుతాయి.