ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్లకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీ లో చాలా సంవత్సరాల పాటు కొనసాగుతూ ఉంటారు.ఇక ఒకప్పుడు ఇండస్ట్రీ లో ఫ్యామిలీ స్టార్( Family Star ) గా కూడా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ అయితే ఏర్పాటు చేసుకున్న హీరో జగపతిబాబు( Hero Jagapathi Babu )… ఈయన చేసిన మంచి సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకోవడమే కాకుండా చాలాకాలం పాటు ఫ్యామిలీ హీరోగా కొనసాగాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న వరుస సినిమాలు సూపర్ సక్సెస్ లను అందుకుంటూ వచ్చాయి.
ప్రస్తుతం ఆయన హీరోగా ఫేడౌట్ అయిపోయిన తర్వాత లెజెండ్ సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో భారీ సక్సెస్ ను అందుకొని సెకండ్ ఇన్నింగ్స్( Second Innings ) ను చాలా గ్రాండ్ గా స్టార్ట్ చేశాడు.ఇక మొత్తానికైతే ప్రస్తుతం ఆయన చేసిన ప్రతి సినిమా సెన్సేషన్ గా మిగిలిపోతుంది.
అన్ని లాంగ్వేజెస్ లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్( Character Artist ) గా చాలా బిజీగా కొనసాగుతున్నాడు.అందుకే ఆయన సినిమాలు చూడ్డానికి ప్రతి ఒక్క అభిమాని విపరీతమైన ఆసక్తిని చూపిస్తున్నారు.
ఆయన చేసిన మావిచిగురు, శుభలగ్నం, పెండ్లి పందిరి లాంటి సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నాయి.
ఇక ఒకప్పటి ఇమేజ్ కి ఇప్పుడున్న ఇమేజ్ కి సంబంధం లేకుండా ఆయన చాలా మంచి సినిమాలు చేస్తూ ముందుకు సాగడం అనేది ప్రతి ఒక్క అభిమానిని ఆనందానికి గురిచేస్తుంది.ఇక ఇదిలా ఉంటే హీరోగా కెరియర్ ముగిసిపోయిన వెంటనే జగపతి బాబు సినిమాలకి గుడ్ బై చెప్పకుండా ఏదో ఒక రకంగా ఇండస్ట్రీలో కొనసాగాలనే ఉద్దేశ్యంతో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా( Villain Roles ) ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేయడం చాలా గొప్ప విషయం అనే చాలామంది చెప్తూ ఉంటారు.ఆయన తీసుకున్న డెసిజన్ వల్లే చాలా బిజీగా మారిపోయాడని తన సన్నిహితులు సలహాలు ఇవ్వడం వల్లే ఆయన ఇండస్ట్రీలో చాలా బిజీగా ఉంటున్నాడని జగపతి బాబు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు…
.