Reels On Luggage Track : రీల్స్ పిచ్చి తగలెయ్య.. రీల్స్ కోసం లగేజ్ ట్రాక్ పై ఆ మహిళ ఏకంగా..?!

మొదటి సారి ఎయిర్‌పోర్ట్‌కి( Airport ) వెళ్లినప్పుడు చాలా మంది సంతోషంతో గంతులు వేస్తారు.వారికి ఆనందానికి అవధులు ఉండవు.

 Desi Influencer Instagram Reel On Airport Conveyor Belt Video Viral-TeluguStop.com

అదే సమయంలో, చాలా సార్లు ప్రజలు ఫ్లైట్ ఎక్కడం గురించి భయాందోళనలకు గురవుతారు.అయితే కొంత మంది మాత్రం విమాన ప్రయాణాన్ని, ఎయిర్‌పోర్టుల్లో తిరగడం పట్ల చాలా సంతోషంగా ఉంటారు.

అయితే సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ఏదైనా చేయడం మొదలుపెట్టే వారు చాలా మంది ఉన్నారు.ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో వ్యూస్, లైక్ ల కోసం కొందరు ఏం చేయడానికైనా సిద్ధమే.

సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ట్రిక్కుల్లో అబ్బాయిల కంటే మహిళల్లో ఎక్కువ కనిపిస్తోంది.

వైరల్ అవ్వడానికి కొందరు సోషల్ మీడియా యూజర్లు చాలా విచిత్రమైన పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తారు.

ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లలో పిచ్చి పఎనులు చేస్తూ కనిపిస్తున్నారు.తాజాగా ఓ అమ్మాయి ఎయిర్‌పోర్ట్ లోపల లగేజీ ట్రాక్‌పై( Luggage Track ) వింత పని చేసింది.

ఆమె ప్రవర్తన చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.ఎక్కడ పడితే అక్కడ రీల్స్ ( Reels ) వీడియోలు తీసుకోవడం ఇటీవల కాలంలో ఓ ట్రెండ్‌గా మారింది.

ఇదే కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.ఇందులో ఓ యువతి ( Woman ) రీల్స్ వీడియోలు చేయడానికి వినూత్న మార్గాన్ని కనుగొంది.ఈ వీడియో కోసం ఆ మహిళ విమానాశ్రయాన్ని లొకేషన్‌గా మార్చింది.విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత చుట్టూ చూసి చివరకు లగేజీ ట్రాక్‌పై వీడియో తీయాలని నిర్ణయించుకుంది.లగేజీ ట్రాక్‌పై పడుకుని చిన్నపిల్లల్లా ఆడుకోవడం ప్రారంభించింది.ఆ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో షారుఖ్, కాజోల్ నటించిన కుచ్ కుచ్ హోతా హై అనే ఫేమస్ పాట వినిపిస్తోంది.

అక్కడున్న వారంతా ఆమె ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దీనిపై సోషల్ మీడియా యూజర్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.కన్వేయర్ బెల్ట్‌పై పడుకున్నందుకు ఈ మహిళకు భారీగా జరిమానా విధించాలని ఒక వినియోగదారు రాశారు.ఇలాంటి ఘటనలను చూసీ చూడనట్లు వదిలేస్తే ఇలా రీల్స్ వీడియోలు ఎక్కడ పడితే అక్కడ అందరూ చేస్తారని కొందరు నెటిజన్లు పేర్కొంటున్నారు.భారీ జరిమానా విధిస్తే ఇలాంటి పనులు రిపీట్ చేయరని స్పష్టం చేస్తున్నారు.

అయితే మరికొందరు మాత్రం ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.ఆమె తనకు నచ్చినట్లు తాను జీవిస్తోందని, ఎవరికీ ఆమె ఇబ్బంది కలిగించలేదు కదా అని వ్యాఖ్యానిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube