మన ప్రయాణం చేసే సమయంలో కొన్నిసార్లు వింత వింత అనుభవాలు ఎదురవడం సహజమే.ప్రస్తుతం నడుస్తున్న సోషల్ మీడియా కారణంగా ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగిన ఆ విషయం ప్రపంచవ్యాప్తంగా ఇట్టే తెలిసిపోతుంది.
కాకపోతే తాజాగా ఓ అంతర్జాతీయ విమానాశ్రయంలో దారుణమైన పరిస్థితి ఏర్పడింది.దాంతో వారు ఎదుర్కొన్న పరిస్థితిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఆ విషయం వైరల్ గా మారింది.
ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.
మామూలుగా మనం ప్రయాణం చేసేటప్పుడు బస్సు, వాహనం, రైలు, విమానం ఇలా ఏదైనా సరే వాటిని ఎక్కేందుకు వెళ్లేముందు వాడి కండిషన్ ను ఆ వాహనం సంబంధించిన ఆపరేటర్లు చెక్ చేసుకోవాలి.
ఇక రైళ్లలో అయితే రైలలోని కంపార్ట్మెంట్ లను పూర్తిగా క్లీన్ చేసిన తర్వాతనే దానిని ప్రయాణికులకు కొరకు ప్లాట్ఫారం పైకి తీసుకువస్తారు.అలాగే విమానాల్లో కూడా పూర్తిగా క్లీన్ చేసిన తర్వాతనే ప్రయాణికుల కోసం రన్ వే పైకి తీసుకువస్తారు.
కాకపోతే., అమెరికాలోని( America ) అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురయింది.
ప్రశాంతంగా ఫ్లైట్ ఎక్కి గమ్య స్థానాలకు చేరాలనుకున్న వారికి చుక్కలు కనిపించాయి.ఫ్లైట్ ఎక్కిన వెంటనే అత్యవసర మార్గం ద్వారా ప్రయాణికులు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.దీనికి కారణం విమానంలో వచ్చిన దుర్గంధం.( Odour ) ఈ చెడు వాసనతో ప్రయాణికులు ఒక్కసారిగా ఫ్లైట్లో ఉండలేక ఎక్కిన వారందరూ ఎమర్జెన్సీ ద్వారం( Emergency Door ) వద్ద నుండి జారుకుంటూ బయటకు వచ్చేశారు.
ఈ సంఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారంది.
ఓర్లాండోలో ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 1759.( Frontier Airlines Flight 1759 ) షార్లెట్ డగ్లస్ అంతర్జాతీయ విమానాశ్రయం( Charlotte Douglas International Airport ) నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న విమానంలో 226 మంది ప్రయాణికులు ఉన్నారు.టేకాఫ్ కు సిద్ధంగా ఉన్న ఫ్లిగ్త లో సడన్ గా తీవ్రమైన దుర్వాసన రావడం ప్రారంభమైంది.
దీంతో వాసన భరించలేక ప్రయాణికులు ఎమర్జెన్సీ డోర్ ల నుంచి కిందకు దిగేశారు.