Barbara Tucker : 40 ఏళ్ల నాటి హత్య కేసులో దోషిని పట్టించిన చూయింగ్ గమ్‌.. అదెలాగంటే..

యూఎస్ఎలోని ఒరెగాన్‌లో( Oregon, USA ) 1980లో జరిగిన ఒక హత్య కేసు తాజాగా సాల్వ్ అయింది.40 ఏళ్లుగా సాల్వ్ కాకుండా ఉన్న ఈ కేసులో ఎట్టకేలకు ఒక వ్యక్తిని దోషిగా నిర్ధారించగలిగారు.మర్డర్ అయిన బాధితురాలు పేరు బార్బరా టక్కర్( Barbara Tucker ).హత్యకు గురయ్యే నాటికి ఆమె వయసు కేవలం 19 ఏళ్లే! ఆమె ఆ సమయంలో మౌంట్ హుడ్ కమ్యూనిటీ కాలేజీలో చదువుతోంది.ఎప్పటిలాగానే 1980, జనవరి 15న ఆమె కాలేజీకి వెళ్లింది.అయితే ఆమెను పార్కింగ్ ఏరియా దగ్గరకు తీసుకువెళ్లి, గాయపరిచి, చంపేశారు.మరుసటి రోజు, ఆమె మృతదేహాన్ని ఇతర విద్యార్థులు కనుగొని షాక్ అయ్యారు.ఆ తర్వాత పోలీసులు రావడం, పోస్ట్ మార్టమ్ చేయడం జరిగింది.

 The Chewing Gum That Caught The Convict In A 40 Year Old Murder Case Is Like Th-TeluguStop.com

కేసు ఇన్వెస్టిగేషన్ ప్రారంభం కావడం మొదలైంది.

Telugu Barbara Tucker, Dna Evidence, Oregon, Robert Plympton, Gum Convict-Telugu

దోషిగా తేలిన వ్యక్తికి 60 ఏళ్లు ఉన్నాయి.అతనిపై ఒక ఫస్ట్-డిగ్రీ మర్డర్, నాలుగు సెకండ్-డిగ్రీ మర్డర్ కేసులు నమోదయ్యాయి.తాను నేరం చేయలేదని, కోర్టు నిర్ణయాన్ని సవాలు చేయాలని యోచిస్తున్నట్లు చెప్పారు.

అయితే అతనికి నేరంతో కనెక్షన్ ఉన్నట్లు చెప్పడానికి చూయింగ్ గమ్ కీలక సాక్ష్యంగా నిలిచింది.హత్య జరిగిన ప్రాంతంలో దొరికిన ఒక చూయింగ్ గమ్‌లోని డీఎన్ఏని శాస్త్రవేత్తలు పరీక్షించారు.

వారు టక్కర్ శవపరీక్ష సమయంలో తీసుకున్న స్వాబ్ల నుంచి కూడా డీఎన్ఏను పొందారు.

Telugu Barbara Tucker, Dna Evidence, Oregon, Robert Plympton, Gum Convict-Telugu

వారు ఈ స్వాబ్ నుంచి డీఎన్ఏ ప్రొఫైల్‌ను తయారు చేశారు.తర్వాత 2021లో ఓ డీఎన్ఏ నిపుణుడు 2000లో తయారు చేసిన డీఎన్ఏ ప్రొఫైల్‌లోని వ్యక్తి రాబర్ట్ ప్లింప్టన్( Robert Plimpton ) అనే వ్యక్తి కావచ్చునని కనుగొన్నారు.పోలీసులు అతను ట్రౌట్‌డేల్‌లో నివసిస్తున్నట్లు గుర్తించారు.

అతను చూయింగ్ గమ్ ఉమ్మివేయడం చూసి వారు దానిని తీశారు.ఈ గమ్ పరీక్షించి ఆ డీఎన్ఏ నేరస్థలంలో దొరికిన చూయింగ్ గమ్‌ డీఎన్ఏతో సరిపోలిందని తెలుసుకున్నారు.

ఈ మ్యాచ్ కారణంగా, పోలీసులు ప్లింప్టన్‌ను 2021, జూన్ 8న అరెస్టు చేశారు.జూన్‌ నుంచి అతనిని జైలుకు తరలించానున్నారు.

చాలా సంవత్సరాల తర్వాత కూడా నేరాలను పరిష్కరించడంలో DNA సాంకేతికత ఎలా సహాయపడుతుందో ఈ ఉదంతం చూపిస్తుంది.ఎంత కాలం గడిచినా న్యాయవ్యవస్థ సత్యాన్ని కనుగొనడానికి కృషి చేస్తుందని కూడా ఇది మనకు గుర్తు చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube