ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయిన ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ( SIB DSP Praneet Rao )విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.ఈ వ్యవహారంలో ప్రణీత్ రావు కీలక విషయాలను వెల్లడించారు.
అప్పటి ఉన్నతాధికారుల ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేశానని పేర్కొన్నారు.ప్రజా ప్రతినిధులు, అధికారులు, మీడియాతో పాటు రియల్ ఎస్టేట్ పెద్దల ఫోన్లను ట్యాప్ చేశానని చెప్పారని తెలుస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ ( Phone tapping ) సమాచారాన్ని అప్పటి ఉన్నతాధికారులకు ఇచ్చానన్నారు.ఎస్పీ స్థాయి అధికారులతో పాటు ఎస్ఐబీ చీఫ్ కి సమాచారం ఇచ్చానన్న ప్రణీత్ రావు చాలా మంది అధికారులు, ప్రజాప్రతినిధుల వాట్సాప్ లపై నిఘా పెట్టినట్లు తెలిపారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే సెల్ ఫోన్లు, హార్డ్ డిస్క్ లు, వేల సంఖ్యలో పత్రాలు ధ్వంసం చేసినట్లు వెల్లడించారు.