మహాశివరాత్రి( Maha Shivaratri ) పర్వదినాన్ని ఎల్లారెడ్డిపేట మండల వ్యాప్తంగా ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు, జాగరణలతో వేడుకగా జరుపుకున్నారు.మహాదేవుడికి మహాన్యాస రుద్రాభిషేకాలు, అర్చనలు, పూజలు, శివపార్వతుల కల్యాణోత్సవాలను అంతటా ఘనంగా నిర్వహించారు.
ఎల్లారెడ్డిపేట మండలంలోని శైవ క్షేత్రాలు, శివాలయాలన్ని భక్తులతో కిటకిటలాడాయి. ఓం నమఃశివాయ.
శంభోశంకర.హరహర మహాదేవ అంటు భక్తి పారవశ్యంతో భక్తులు చేసిన శివనామస్మరణలతో శివాలయాలు మారుమ్రోగాయి , ఉపవాస దీక్షల సందర్భంగా శివాలయాల్లో రాత్రివేళ లింగోద్భవ పూజలను ఘనంగా నిర్వహించారు.
అక్కపెల్లి శ్రీ బుగ్గ రాజా రాజేశ్వర స్వామి క్షేత్ర సందర్శనకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు.ఆర్చకులు బుగ్గ వాసు శర్మ ఆద్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి , ఎల్లారెడ్డిపేట గ్రామ పంచాయతీ ఎదుట పురాతన శివాలయం( Shivalayam )లో ఆలయ పూజారి రాచర్ల హానుమండ్లు శర్మ , సద్ది మద్దుల రెడ్డి సంఘం వద్ద శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం లో గ్రామ పురోహితులు రాచర్ల కృష్ణ మూర్తి శర్మ మహాశివుడికి అభిషేకాలు, పూజలు నిర్వహించి అనంతరం కన్నుల పండువగా శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు, అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్త కోటికి తీర్థ ప్రసాదాలు, సీరా, కంధగడ్డ , వాటర్ మెలూనూ వితరణ చేశారు.