తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్( Rajinikanth ) సూపర్ స్టార్ గా ఎలాంటి ఇమేజ్ ను అయితే అందుకున్నారో తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి( Chiranjeevi ) కూడా మెగాస్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను అయితే సంపాదించుకొని పెట్టుకున్నారు.ఇంక దాదాపు 40 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో తనని ఢీకొట్టి హీరో లేకుండా ఒక్కడే ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీని శాసిస్తున్నాడు అంటే మామూలు విషయం కాదు.
అందుకే ఇండస్ట్రీ లో చిరంజీవిని కొందరు అన్నయ్య( Annaya ) అని పిలిస్తే మరి కొంతమంది మాత్రం బాస్ అని పిలుస్తూ వుంటారు.ఇలా అభిమానులు చిరంజీవిని రకరకాల పేర్లతో అభిమానులు పిలవడం అంటే చాలా ఇష్టమట…ఇక ఇదిలా ఉంటే రజినీకాంత్ చేయాల్సిన ఒక సినిమాని చిరంజీవి చేశారనే ఒక వార్త అప్పట్లో ఇండస్ట్రీ లో చాలా హాట్ టాపిక్ గా మారింది.ఇక రజినీకాంత్ సురేష్ కృష్ణ దర్శకత్వంలో తమిళ్ తెలుగులో కలిపి సినిమా చేద్దామని అనుకున్నాడంట కానీ రజనీకాంత్ అప్పుడు కొన్ని సినిమాల్లో బిజీ గా ఉండడం వల్ల ఈ సినిమాని వదిలేసుకున్నాడు.ఇక దాంతో చిరంజీవికి ఈ కథ చెప్పు ఒప్పించి సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించటం అంటే మాములు విషయం కాదు.
ఇక ఈ సినిమా రజనీకాంత్ కైనా చాలా బాగా ఉంటుంది.ఎందుకంటే మాస్టారు గా రజినీకాంత్ చాలా అద్భుతంగా నటించి మెప్పించేవాడు.
ఇక మొత్తానికైతే చిరంజీవికి ఈ సినిమాతో ఒక భారీ బ్లాక్ బస్టర్ హిట్ దక్కిందనే చెప్పాలి.ఇలా చిరంజీవి రజనీకాంత్ రిజెక్ట్ చేసిన కథతో సూపర్ సూపర్ సక్సెస్ అందుకోవడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.ఇక ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమాలో బిజీగా ఉన్నాడు.అలాగే రజనీకాంత్ కూడా లోకేష్ కనకరాజు తో సినిమా కోసం తీవ్రమైన కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది…
.