Womens Premier League 2024 : నేడు ముంబై వర్సెస్ బెంగుళూరు మధ్య కీలక పోరు..!

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024( Womens Premier League 2024 ) లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగే అవకాశం ఉంది.ఈ మ్యాచ్ లో గెలవడం ఇరు జట్లకు చాలా కీలకం.

 Today Is A Crucial Battle Between Mumbai And Bangalore-TeluguStop.com

గత మ్యాచ్లో ఈ రెండు జట్లు ఓటమిని చవిచూశాయి. ముంబై ఇండియన్స్( Mumbai Indians ) తో జరిగిన చివరి మ్యాచ్లో యూపీ వారియర్స్ విజయం సాధిస్తే.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తో జరిగిన చివరి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది.

Telugu Delhi, Mumbai Indians, Smriti Mandhana, Womenspremier-Sports News క్�

నేడు జరిగే మ్యాచ్లో ఏ జట్టు విజయం సాధిస్తుందో ఆ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకొనుంది.ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగు జట్లు నాలుగు పాయింట్లతో ఉన్నాయి.అయితే రన్ రేట్ పరంగా చూసుకుంటే.

ఢిల్లీ అగ్రస్థానంలో, బెంగుళూరు రెండవ స్థానంలో, యూపీ వారియర్స్ మూడవ స్థానంలో, ముంబై ఇండియన్స్ నాలుగవ స్థానంలో నిలిచాయి.గుజరాత్ జాయింట్స్ ఆడిన మూడు మ్యాచ్లలో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు.

దీంతో గుజరాత్ చివరి స్థానంలో ఉంది.నేడు బెంగళూరు వర్సెస్ ముంబై మధ్య జరిగే మ్యాచ్ పాయింట్ల పట్టికలో గణనీయమైన మార్పు తీసుకురానుంది.

ఇక భారత జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ముంబై ఇండియన్స్ జట్టుకు నాయకత్వం వహిస్తుండగా.భారత జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మందాన ( Smriti Mandhana )రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు నాయకత్వం వహిస్తోంది.

Telugu Delhi, Mumbai Indians, Smriti Mandhana, Womenspremier-Sports News క్�

నేడు జరిగే మ్యాచ్ తో ఈ ఇద్దరు కెప్టెన్ లలో ఎవరు బెస్ట్ కెప్టెన్ అనేది ఆసక్తికరంగా మారింది.గత సీజన్ 2023 ను ఒకసారి గమనిస్తే.బెంగళూరు, ముంబై జట్లు రెండుసార్లు తలపడితే రెండు మ్యాచ్లలోను ముంబై ఇండియన్స్ విజయం సాధించింది.నేటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పై విజయం సాధించి, విజయం ఖాతా తెరవాలని ఆర్బీసీ( Royal Challengers Bangalore ) జట్టు గట్టి పట్టుదలతో బరిలోకి దిగనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube