Womens Premier League 2024 : నేడు ముంబై వర్సెస్ బెంగుళూరు మధ్య కీలక పోరు..!
TeluguStop.com
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024( Womens Premier League 2024 ) లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగే అవకాశం ఉంది.
ఈ మ్యాచ్ లో గెలవడం ఇరు జట్లకు చాలా కీలకం.గత మ్యాచ్లో ఈ రెండు జట్లు ఓటమిని చవిచూశాయి.
ముంబై ఇండియన్స్( Mumbai Indians ) తో జరిగిన చివరి మ్యాచ్లో యూపీ వారియర్స్ విజయం సాధిస్తే.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తో జరిగిన చివరి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది.
"""/" /
నేడు జరిగే మ్యాచ్లో ఏ జట్టు విజయం సాధిస్తుందో ఆ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకొనుంది.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగు జట్లు నాలుగు పాయింట్లతో ఉన్నాయి.అయితే రన్ రేట్ పరంగా చూసుకుంటే.
ఢిల్లీ అగ్రస్థానంలో, బెంగుళూరు రెండవ స్థానంలో, యూపీ వారియర్స్ మూడవ స్థానంలో, ముంబై ఇండియన్స్ నాలుగవ స్థానంలో నిలిచాయి.
గుజరాత్ జాయింట్స్ ఆడిన మూడు మ్యాచ్లలో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు.దీంతో గుజరాత్ చివరి స్థానంలో ఉంది.
నేడు బెంగళూరు వర్సెస్ ముంబై మధ్య జరిగే మ్యాచ్ పాయింట్ల పట్టికలో గణనీయమైన మార్పు తీసుకురానుంది.
ఇక భారత జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ముంబై ఇండియన్స్ జట్టుకు నాయకత్వం వహిస్తుండగా.
భారత జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మందాన ( Smriti Mandhana )రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు నాయకత్వం వహిస్తోంది.
"""/" /
నేడు జరిగే మ్యాచ్ తో ఈ ఇద్దరు కెప్టెన్ లలో ఎవరు బెస్ట్ కెప్టెన్ అనేది ఆసక్తికరంగా మారింది.
గత సీజన్ 2023 ను ఒకసారి గమనిస్తే.బెంగళూరు, ముంబై జట్లు రెండుసార్లు తలపడితే రెండు మ్యాచ్లలోను ముంబై ఇండియన్స్ విజయం సాధించింది.
నేటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పై విజయం సాధించి, విజయం ఖాతా తెరవాలని ఆర్బీసీ( Royal Challengers Bangalore ) జట్టు గట్టి పట్టుదలతో బరిలోకి దిగనుంది.
ఈ పవర్ ఫుల్ రెమెడీతో పసుపు దంతాలకు చెప్పండి గుడ్ బై..!