తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్( KTR ) కీలక వ్యాఖ్యలు చేశారు.మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను పరిశీలిస్తామని చెప్పారు.
రోజుకు ఐదు వేల క్యూసెక్కుల నీరు వృథాగా పోతుందని తెలిపారు.అన్నారంలో( Annaram ) పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామన్నారు.చలో మేడిగడ్డలో( Chalo Medigadda ) భాగంగా సుమారు రెండు వందల మంది నేతలం వెళ్తామన్న కేటీఆర్ మేడిగడ్డ బ్యారేజీలో ఏర్పడ్డ పగుళ్లను పరిశీలిస్తామని తెలిపారు.80 రోజుల పాలనలో ఆరోపణలు, శ్వేతపత్రాలతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలక్షేపం చేసిందని ఆరోపించారు.ఎన్డీఎస్ఏ సాంకేతిక బృందం ఎక్కడైనాన శాంపిల్ సేకరించిందా అని ప్రశ్నించారు.
ఎన్డీఎస్ఏ రాజకీయ ప్రేరేపిత నివేదిక ఇచ్చిందన్న కేటీఆర్ నివేదిక ప్రభుత్వానికి కాకుండా మీడియాకు ఎలా అందిందని నిలదీశారు.రాష్ట్ర ప్రజల దృష్టిని మళ్లించేందుకే సిల్లీ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు.ఈ క్రమంలోనే తప్పు జరిగితే చర్యలు తీసుకోవాలన్నారు.
నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నా ఇవ్వకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.కాంగ్రెస్ కు( Congress ) చేతకాకపోతే తప్పుకోవాలని చెప్పారు.
హరీశ్ రావు చెప్పినట్లు తాము నీటిని ఎత్తిపోసి చూపిస్తామని తెలిపారు.నిపుణుల కమిటీ వేసి వర్షాలు ప్రారంభం అయ్యే లోపు మరమ్మత్తులు చేయాలని సూచించారు.