కస్తూరి శంకర్( Kasturi Shankar ) పరిచయం అవసరం లేని పేరు ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగినటువంటి ఈమె ఇటీవల కాలంలో బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తున్నారు.ఇకపోతే కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచినటువంటి కస్తూరి శంకర్ తాజాగా త్రిష( Trisha ) కు మద్దతుగా నిలబడ్డారు.
త్రిష గురించి అన్నా డీఎంకే నేత మాట్లాడిన కాంట్రవర్సియల్ కామెంట్స్ పై స్పందించిన కస్తూరి శంకర్ తనదైన స్టైల్ లోనే వారికి మాస్ వార్నింగ్ ఇచ్చారు.
ఈ సందర్భంగా కస్తూరి శంకర్ మాట్లాడుతూ.ఈరోజు నేను నిజంగా నన్ను బాధపెట్టే విషయం గురించి మాట్లాడబోతున్నాను.ఈ మధ్య సినిమా నటీమణులపై దూషణలు ఎక్కువయ్యాయి.
నిజా నిజాలు తెలియకుండా సెలబ్రిటీల పట్ల ప్రతి ఒక్కరూ తప్పుగా మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయింది.అసలు మీ కళ్ళకు మేము ఎలా కనిపిస్తున్నాము అంటూ ఈమె ప్రశ్నించారు.
సినీరంగంలో ఉన్నవారంతా వేశ్యల్లా కనిపిస్తున్నారా.? మీరు చేసే కామెంట్స్ అలానే ఉన్నాయి. సెలబ్రిటీలకు( Celebrities ) కూడా అమ్మానాన్నలు ఉంటారనే విషయాన్ని గుర్తు పెట్టుకొని మాట్లాడాలని ఈమె తెలియజేశారు.
సెలబ్రిటీల గురించి ఇలా మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు అంటూ ఈమె ప్రశ్నించారు.నటీమణులు వ్యభిచారిణులు, నటులు వర్క్‌హోలిక్‌లు అంటూ మాట్లాడే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? మీరు ఇలా మాట్లాడితే. రాజకీయ నాయకుల పై( Political Leaders ) ఉన్న నమ్మకం కూడా పోతుందని తెలిపారు.
ఎలాంటి కల్మషం లేకుండా రాజకీయాలలో పనిచేసే వారి పట్ల కూడా నమ్మకాలు కోల్పోవలసి వస్తుందని కస్తూరి శంకర్ వెల్లడించారు.గత కొన్ని దశాబ్దాలుగా మహిళలు కేవలం ఇంటికి మాత్రమే పరిమితమయ్యారు ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి అన్ని రంగాలలోనూ విజయం సాధిస్తున్నారు.
అలాంటి వారి పట్ల ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని నోరు నాలుక ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం మంచిది కాదని నోరు అదుపులో పెట్టుకోవాలి అంటూ తన స్టైల్ లోనే ఈమె వార్నింగ్ ఇచ్చారు.