గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్( Greater Hyderabad Municipal Corporation ) పాలకమండలి సమావేశం ముగిసింది.వాడీవేడీగా సాగిన ఈ సమావేశంలో అధికారులపై కార్పొరేటర్లు తీవ్ర ఆరోపణలు చేశారు.
మరోవైపు జీహెచ్ఎంసీ అధికారులపై మేయర్ గద్వాల విజయలక్ష్మీ( Mayor Gadwal Vijayalaxmi ) తీవ్రంగా మండిపడ్డారు.గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కోసం పని చేసే అధికారులే జీహెచ్ఎంసీలో ఉండాలని ఆమె తెలిపారు.
ఈ క్రమంలోనే పని చేయని అధికారులను ప్రభుత్వానికి సరెండర్ చేయాలని కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు.
ప్రకటనల విభాగంలో జరిగిన అవకతవకలపై విచారణకు మేయర్ విజయలక్ష్మీ ఆదేశమిచ్చారు.అనంతరం డివిజన్లలో నెలకొన్న పలు సమస్యలను కార్పొరేటర్లు మేయర్ దృష్టికి తీసుకెళ్లారు.ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీలోని కొందరు అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని కార్పొరేటర్లు ఆరోపించారు.
అలాగే బడ్జెట్ కోసం జీహెచ్ఎంసీ కౌన్సిల్( GHMC Council ) రేపు మరోసారి సమావేశం కానుంది.