Chandrababu Naidu : చంద్రబాబు అవినీతి దందా.. ఫైబర్ నెట్ స్కాంలో సీఐడీ ఛార్జ్‎షీట్

ఫైబర్ నెట్ స్కాం కేసు( Fiber Net Scam Case ) ఏపీలో పెను సంచలనంగా సృష్టించిన సంగతి తెలిసిందే.గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో దోపిడీ బాగోతాలు యథేచ్చగా కొనసాగాయని, అందులో ఫైబర్ నెట్ అవినీతి పర్వం ఓ మచ్చుతునక మాత్రమేనని పలు విమర్శలు వినిపిస్తున్నాయి.

 Chandrababus Corruption Charge Cid Charge Sheet In Fibernet Scam-TeluguStop.com

అడ్డగోలుగా ప్రభుత్వ ప్రాజెక్టులు కట్టబెట్టడమే కాకుండా ప్రజాధనాన్ని కొల్లగొట్టారంటూ ఆనాటి సీఎం, టీడీపీ అధ్యక్షులు చంద్రబాబుపై( Chandrababu Naidu ) ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి అందరికీ తెలిసిందే.కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ ను చంద్రబాబు తన సన్నిహితుల్లో ఒకరైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి కట్టబెట్టారు.

ఈ క్రమంలోనే నిధులను దోచుకున్నారంటూ చంద్రబాబుపై ఏపీ సీఐడీ కొరడా ఝుళిపించింది.ఫైబర్‌ నెట్‌ కుంభకోణం కేసులో విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో శుక్రవారం చార్జ్‌షీట్‌ను సీఐడీ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ స్కాం కేసులో ఏ1గా అప్పటి సీఎం చంద్రబాబు, ఏ2 గా టెరాసాఫ్ట్‌ కంపెనీ ఎండీ వేమూరి హరికృష్ణ,( Vemuri Harikrishna ) ఏ3 గా ఏపీ ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌, ఇన్‌క్యాప్‌ సంస్థలకు అప్పటి ఎండీగా ఉన్న కోగంటి సాంబశివరావు( Koganti Sambasivarao ) తోపాటు మరికొందరిని నిందితులుగా పేర్కొంది.అలాగే వారిపై ఐపీసీ సెక్షన్లు 166, 167, 418, 465, 468, 471, 409, 506 రెడ్‌ విత్‌ 120(బి)లతోపాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(2), రెడ్‌ విత్‌ 13(1)(సి)(డి) ప్రకారం కేసు నమోదు చేసింది.

ఫైబర్‌నెట్‌ ప్రాజెక్ట్‌ పేరుతో చంద్రబాబు ముఠా ప్రజాధనాన్ని ఎలా కొల్లగొట్టిందనే విషయాలను సీఐడీ తన చార్జ్‌షీట్‌లో క్లారిటీగా వివరించింది.

Telugu Ap Cid, Chandrababu, Chandrababus, Cid, Fiber Net Scam, Tdp-Latest News -

చంద్రబాబు ప్లాన్ లో భాగంగా.యథేచ్చగా అవినీతికి పాల్పడమే కాకుండా నిధులను దోచుకునేందుకే చంద్రబాబు ఫైబర్ నెట్ ప్రాజెక్టును అడ్డగోలుగా టెరాసాఫ్ట్ కంపెనీకి అప్పజెప్పారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సుమారు రూ.2 వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు కింద తొలిదశలో రూ.333 కోట్ల విలువైన పనుల్లో అక్రమాలు చేశారని తెలుస్తోంది.ఈ ప్రాజెక్టును ఐటీ శాఖ చేపట్టాల్సి ఉన్నప్పటికీ .చంద్రబాబు విద్యుత్, మౌలిక వసతుల కల్పన, పెట్టుబడుల శాఖ ద్వారా చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారని సీఐడీ చెబుతోంది.

అంతేకాదు చంద్రబాబు ఈ ప్రాజెక్టును టెరాసాఫ్ట్( Terasoft ) సంస్థకే అప్పగించాలని ముందే నిర్ణయం తీసుకున్నారని, అందుకూ వేమూరి హరికృష్ణను ఏపీ ఈ-గవర్నింగ్ కౌన్సిల్ లో సభ్యునిగా చేర్చారని తెలుస్తోంది.నేర చరిత్ర ఉన్న వ్యక్తిని కీలక స్థానంలో నియమించడంపై అందరినీ విస్మయానికి గురి చేసింది.

నిబంధనలకు విరుద్ధంగా ఆయనను ఫైబర్ నెట్ టెండర్ల మదింపు కమిటీలో సభ్యుడిగానూ చంద్రబాబు నియమించారు.అయితే ప్రాజెక్టు కోసం బిడ్లు దాఖలు చేసే కంపెనీ వ్యక్తులు ఈ కమిటీలో ఉండకూడదనేది నిబంధన.

కానీ చంద్రబాబు ఆ నిబంధనను ఉల్లంఘించి వేమూరిని కమిటీలో సభ్యునిగా నియమించారు.

Telugu Ap Cid, Chandrababu, Chandrababus, Cid, Fiber Net Scam, Tdp-Latest News -

ఫైబర్ నెట్ ప్రాజెక్టు విలువను సైతం చంద్రబాబు అమాంతంగా పెంచేశారని తెలుస్తోంది.ఎటువంటి మార్కెట్ సర్వే చేయకుండానే ప్రాజెక్టు కింద సరఫరా చేయాల్సిన పరికరాలు, వాటి నాణ్యతను ఖరారు చేసి విలువను పెంచారని సమాచారం.వేమూరి హరికృష్ణ, అప్పటి ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఎండీ కోగంటి సాంబశివరావు ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది.

ఈ ప్రాజెక్ట్ టెండర్ల ప్రక్రియ చేపట్టే నాటికి టెరాసాఫ్ట్ కంపెనీ ప్రభుత్వ బ్లాక్ లిస్టులో ఉంది.పౌర సరఫరాల శాఖకు ఈపోస్‌ యంత్రాల సరఫరాలో విఫలమైన ఆ కంపెనీని ప్రభుత్వం బ్లాక్‌ లిస్టులో పెట్టింది.

కానీ చంద్రబాబు అదే కంపెనీని బ్లాక్‌ లిస్టు నుంచి ఏకపక్షంగా తొలగించారు.అనంతరం పోటీలో ఉన్న పలు కంపెనీలను పక్కన పెట్టేశారు.దీనిపై పేస్‌ పవర్‌ అనే కంపెనీ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ పట్టించుకోలేదని వార్తలు వినిపించాయి.కేంద్ర ప్రభుత్వ రంగ సం‍స్థలను కూడా సాంకేతిక కారణాలతో అనర్హులుగా చేసి మరీ టెరాసాఫ్ట్‌కే ప్రాజెక్టును కట్టబెట్టారని టాక్.

టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని పట్టుబట్టిన ఓ అధికారిని హఠాత్తుగా బదిలీ చేసి తమకు అనుకూలమైన అధికారులను నియమించారని సమాచారం.టెండర్ల ప్రక్రియ మొదలైన తరువాత కూడా టేరాసాఫ్ట్‌ కంపెనీ కొన్ని మార్పులు చేసి సాంకేతికంగా అధిక స్కోర్‌ సాధించేందుకు వివిధ పత్రాలను ట్యాంపర్‌ చేశారని ఆరోపణలు వచ్చాయి.

Telugu Ap Cid, Chandrababu, Chandrababus, Cid, Fiber Net Scam, Tdp-Latest News -

అలాగే రాష్ట్రంలో ఫైబర్ నెట్ ప్రాజెక్టును అమలు చేయడంలోనూ టెరాసాఫ్ట్ కంపెనీ నిర్లక్ష్యంగా వ్యవహారించింది.టెండర్‌ నోటిఫికేషన్‌లో పేర్కొన్న నాణ్యత ప్రమాణాలను ఏమాత్రం పట్టించుకోలేదని తెలుస్తోంది.దీని కారణంగా సుమారు ఎనభై శాతం ప్రాజెక్టు పనులు నిరుపయోగంగా మారాయి.మరోవైపు షెల్‌ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని అక్రమంగా తరలించారని సమాచారం.వేమూరి హరికృష్ణ తన సన్నిహితుడు కనుమూరి కోటేశ్వరరావు( Kanumuri Koteswara Rao ) సహకారంతో కథ నడిపించారని తెలుస్తోంది.వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్, ఫ్యూచర్‌ స్పేస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలలో కనుమూరి కోటేశ్వరరావు భాగస్వామిగా ఉన్నారన్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపీచంద్, రామ్‌కుమార్‌ రామ్మూర్తిలతో కలసి విజయవాడ కేంద్రంగా నెటాప్స్‌ ఫైబర్‌ సొల్యూషన్స్‌ ఎల్‌ఎల్‌పీ అనే మ్యాన్‌పవర్‌ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్‌ కంపెనీని సృష్టించారు.ఆ కంపెనీ ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్టుకు సిబ్బందిని సమకూర్చినట్లు, పర్యవేక్షించినట్లు తెలిసింది.ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్‌ కంపెనీ, ఇతర కంపెనీలకు చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా రూ.284 కోట్లు విడుదల చేసింది.నకిలీ ఇన్వాయిస్‌లతో ఆ నిధులను కొల్లగొట్టి, కనుమూరి కోటేశ్వరరావు ద్వారా అక్రమంగా తరలించారని, వాటిలో రూ.144 కోట్లను షెల్‌ కంపెనీల ద్వారా తరలించారని ఆరోపణలు వచ్చాయి.ఇక నాసిరకమైన పనులతో కూడా ప్రభుత్వ ఖజానాకు రూ.119.8 కోట్ల నష్టం వాటిల్లిందని సీఐడీ నిగ్గు తేల్చిందని తెలుస్తోంది.

ఫైబర్‌నెట్‌ స్కాంపై కేసు నమోదు చేసిన సీఐడీ ( CID ) తన విచారణలో భాగంగా కీలకమైన ఆధారాలు సేకరించింది.

ఇందులో భాగంగానే ఇండిపెండెంట్‌ ఏజెన్సీ ఐబీఐ గ్రూప్‌ ద్వారా ఆడిటింగ్‌ జరపగా.స్కాం అవినీతి మొత్తం బట్టబయలైంది.టెరాసాఫ్ట్‌ కంపెనీ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా.నాసిరకం పరికరాలు సరఫరా చేసి ప్రభుత్వాన్ని మోసగించిందని ఐబీఐ గ్రూప్‌ నిర్ధారించింది.

ఫైబర్‌ నెట్‌ కుంభకోణంలో నిధులు కాజేసిన తీరును అధికారులు వెల్లడించారు.నిబంధనలను చంద్రబాబు బేఖాతరు చేయడంతోనే టెండర్ల ప్రక్రియలో క్రియాశీలంకంగా వ్యవహరించామని వారు పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే 164 సీఆర్‌పీసీ ప్రకారం న్యాయస్థానంలో వాంగ్మూలాన్ని నమోదు చేయడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube