విజయనగరం జిల్లా నెల్లిమర్లలో టీడీపీ నేత నారా లోకేశ్( Nara Lokesh ) ‘శంఖారావం’ సభ జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
సీఎం జగన్ కు వచ్చే ఎన్నికల్లో షాక్ తప్పదని పేర్కొన్నారు.
జాబ్ క్యాలెండర్ అని చెప్పి యువతను మోసం చేశారని ఆరోపించారు.నెల్లిమర్ల ఎమ్మెల్యే కుటుంబం అక్రమ మైనింగ్ చేస్తుందన్న లోకేశ్ ఇసుక సంపదను దోచుకుంటున్నారని ఆరోపణలు చేశారు.వైసీపీని( YCP ) ప్రజలు నమ్మే స్థితిలో లేరన్న ఆయన రానున్న ఎన్నికల్లో టీడీపీ – జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.