ఝార్ఖండ్ లో రాజకీయ అనిశ్చితి వీడింది.ప్రభుత్వ ఏర్పాటుకు ఝార్ఖండ్ ముక్తి మోర్చా శాసనసభ పక్ష నేత చంపై సోరెన్ ను( Champai Soren ) గవర్నర్ రాధాకృష్ణన్ ఆహ్వానించారు.
ఈ క్రమంలోనే పది రోజుల్లో బల నిరూపణ చేసుకోవాలని చంపై సోరెన్ కు గవర్నర్ రాధాకృష్ణన్ ( Radhakrishnan )ఆదేశాలు ఇచ్చారు.అయితే మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్( Hemant Soren )అరెస్ట్ అయిన నేపథ్యంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి ఏర్పడిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో 81 మంది ఎమ్మెల్యేలున్న అసెంబ్లీలో తనకు 48 మంది మద్ధతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని జేఎంఎం శాసనసభా పక్ష నేత చంపై సోరెన్ గవర్నర్ కు విన్నవించారు.ఈ నేపథ్యంలో సీఎంగా చంపై సొరెన్ ను నియమించారు.
ఇందులో భాగంగా చంపై సోరెన్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలుస్తోంది.