సాధారణంగా బాగా రద్దీగా ఉన్న ట్రైన్లలో( Trains ) ప్రయాణించడం చాలా ఇబ్బందికరమని చెప్పుకోవచ్చు.రద్దీగా ఉన్న రైలులో సీట్ దొరకక నిలబడాల్సి ఉంటుంది.
అటు ఇటు తోసుకొని ఒక చిన్నపాటి నరకం అనుభవించాల్సి ఉంటుంది.ఇక బాగా అలసిపోయి కాసేపు నిద్ర పోవాలనుకున్నా అది కుదరని పని అని చెప్పవచ్చు.
కొందరైతే టికెట్ దొరకకపోయినా ప్రయాణం చేయడానికి రెడీ అయిపోతుంటారు.రద్దీగా ఉన్నా సరే బోగీలలోకి ఎక్కేసి తమకంటూ స్పేస్ క్రియేట్ చేసుకుంటుంటారు.
ఇటీవల, టిక్కెట్ లేని ఓ ప్రయాణికుడు( Ticketless Passenger ) ఖాళీ సీట్ ఏది తనకి దొరకకపోవడంతో ఒక క్రియేటివ్ ఆలోచన చేశాడు.రద్దీగా ఉండే రైలులో తన కోసం కొంత స్పేస్ సంపాదించాలని అతడు అనుకున్నాడు కానీ చివరికి ఘోరంగా ఫెయిల్ అయ్యాడు.
దీంతో నవ్వుల పాలయ్యాడు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వైరల్ క్లిప్ ఓపెన్ చేస్తే మనకు అనేక మంది వ్యక్తులు కింద కూర్చున్న లోకల్ ట్రైన్ జనరల్ క్లాస్( General Class ) కనిపిస్తుంది.
తర్వాత టికెట్ లేని వ్యక్తి తనకు తాత్కాలిక సీటును సృష్టించుకోవడానికి ఎవరూ ఊహించని ఒక మార్గాన్ని అనుసరించాడు.ఈ ప్రయాణికుడు కోచ్ ఎగువ బర్త్‌లకు రెండు వైపులా బెడ్‌షీట్‌ను( Bedsheet ) కట్టి ఊయల లాంటి బెడ్ క్రియేట్ చేశాడు.దానిని మామూలుగానే కట్టాడు.
తర్వాత ఆ ఊయల లాంటి బెడ్ లో పడుకుందాం అనుకున్నాడు.కానీ ఆ స్లింగ్ బెడ్ అతడి బరువు ఆపలేక ఒక పక్క వెంటనే ఊడిపోయింది.
దాంతో సదరు వ్యక్తి ఢబేలు మని ఒకేసారి కింద పడిపోయాడు. అది చూసి అందరూ నవ్వేశారు.కొందరు మాత్రం అయ్యో పాపం అని సానుభూతి చూపించారు.ఈ వీడియో @ChapraZila అనే ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.దీనికి ఇప్పటికే లక్షలకు పైగా వ్యూస్ వేలల్లో లైకులు వచ్చాయి ఈ ఫన్నీ వీడియోను మీరు కూడా చూసేయండి.