పొగాకు పంటలో( Tobacco Crop ) మంచి దిగుబడి సాధించాలంటే ఆరోగ్యవంతమైన పొగాకు నారు ను ఎంపిక చేసుకుని పొలంలో నాటుకోవాలి.కాబట్టి పొగాకు నారు పెంచే విధానం గురించి పూర్తిగా అవగాహన ఉంటేనే పొగాకు పంటను సాగు చేసి అధిక దిగుబడి సాధించవచ్చు.
పొగాకు నారు మడికి ఇసుక నేలలు, ఎర్ర నేలలు చాలా అనుకూలం.అదే నల్ల రేగడి నేలలలో నారు పెంచాలంటే నేల ఉపరితల భాగాన్ని గుల్ల పరచాలి.
నారు పెంచే స్థలం ప్రతి ఏడాది మార్చడం వల్ల వివిధ రకాల చీడపీడలు లేదా తెగుళ్లు ఆశించకుండా ఉండే అవకాశం ఉంది.
నారు పెంచే స్థలాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత నేలను( Soil ) రాబింగ్ పద్ధతి ద్వారా శుద్ధి చేయాలి.
అంటే మడిపై వరి ఊకను పరిచి కాల్చడం అన్నమాట.ఇలా చేస్తే నేల నుండి సంక్రమించే కొన్ని వ్యాధులు, క్రిములు మరియు శిలీంద్రాలు, కలుపు మొక్కల విత్తనాలు నశిస్తాయి.
వేసవికాలంలో( Summer ) రెండుసార్లు నారు పెంచే స్థలాన్ని దుక్కి చేసుకోవాలి.ఆ తర్వాత పది మీటర్ల పొడవు 1.20 మీటర్ల వెడల్పు ఉండే మడులు ఏర్పాటు చేయాలి.మడుల మధ్య 50 సెంటీమీటర్ల వెడల్పు గల కాలువలు ఏర్పాటు చేయాలి.
నారుమడి ఎత్తు కాలువ కంటే 15 సెంటీమీటర్లు ఎత్తు ఉండాలి.
ఒక ఎకరం పొలానికి 1.5 కిలోల విత్తనాలు అవసరం.నారు వేయడానికి కనీసం 15 రోజుల ముందు పది చదరపు మీటర్ల మడికి 25 కేజీల పశువుల ఎరువును వేయాలి.
అలాగే 100 గ్రాముల అమోనియం సల్ఫేట్,( Ammonium Sulphate ) 300 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్, 50 గ్రాముల పొటాషియం సల్ఫేట్, 100 గ్రాముల డోలమైట్ వేయాలి.మేలు రకం తెగులు నిరోధక విత్తనాలను ఎంపిక చేసుకుని 10 చదరపు మీటర్ల మడికి ఐదు గ్రాముల విత్తనాలు వేయాలి.
విత్తనాలు( Seeds ) నారుమడిలో చల్లిన తర్వాత మడులపై వరిగడ్డిని లేక సవిరి రెమ్మలను గాని పరవాలి.ఉమ్మడికి మైక్రోస్పింక్లర్లను అమర్చి, వాటి ద్వారా నీటిని అందించాలి.నారు 3 వారాల వయసుకు వచ్చిన తర్వాత ఆరుమడులపై కప్పిన వరిగడ్డిని కాస్త పలుచగా చేయాలి.ఆ తర్వాతి వారంలో వరిగడ్డిని పూర్తిగా తీసివేయాలి.నారుమడిలో కలుపు కనిపించిన వెంటనే తీసేయాలి.ఈ సస్యరక్షక పద్ధతులు పాటిస్తే ఆరోగ్యమైన పొగాకు నారు పొందవచ్చు.
ఈ నారును ప్రధాన పొలంలో నాటుకుంటే అధిక దిగుబడి సాధించవచ్చు.