ఈ మధ్య కాలంలో చిన్న సినిమా లకు మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి.ఆనంద్ దేవరకొండ నటించిన బేబీ () Baby movie )సినిమా దాదాపు గా వంద కోట్ల వసూళ్లు నమోదు చేసిన విషయం తెల్సిందే.
ఇక మ్యాడ్ సినిమా కూడా భారీ గానే వసూళ్లు రాబట్టింది.ఇలా చెప్పుకుంటూ పోతే 2023 సంవత్సరం లో చిన్న సినిమా ల రాజ్యం నడిచింది అనడంలో సందేహం లేదు.
ఇప్పుడు ఏడాది చివర్లో మరో చిన్న క్రేజీ మూవీ రాబోతుంది.భారీ అంచనాల నడుమ రూపొందిన సినిమా లు కూడా దక్కించుకోలేని ప్రీ రిలీజ్ బజ్ ను మంగళవారం దక్కించుకుంది అనడంలో సందేహం లేదు.
అందుకే ఈ సినిమా కు మంచి బిజినెస్ కూడా జరిగింది.పెట్టిన పెట్టుబడికి దాదాపుగా రెట్టింపు లాభం దక్కిందట.చిరంజీవి ట్రైలర్ విడుదల చేయడం తో పాటు అల్లు అర్జున్ ప్రీ రిలీజ్ వేడుక కి హాజరు అవ్వడం తో ఈ సినిమా స్థాయి అమాంతం పెరిగింది అనడం లో సందేహం లేదు.ఇక ఈ సినిమా విషయం లో జరుగుతున్న పాజిటివ్ చర్చ కూడా సినిమాకు కలిసి వచ్చేలా ఉంది.
ఇక సాధారణంగా అయితే సినిమా యొక్క ప్రీమియర్ షో లు ఒక్క స్క్రీన్ లో లేదా ఒక్క థియేటర్ లో వేస్తారు.కానీ మంగళవారం సినిమా యొక్క ప్రీమియర్ షో లు చాలా థియేటర్ లలో చాలా చోట్ల వేయడం జరిగింది.నమ్మకం ఉన్న సినిమా లను ప్రీమియర్ లు వేయడం ద్వారా నిర్మాతకు అదనపు లాభం అని దీంతో నిరూపితం అయింది.ఇప్పటికే గతంలో కొన్ని సినిమా లు ప్రీమియర్ షో ల వల్ల లాభం దక్కించుకున్నాయి.
కనుక ముందు ముందు ఈ సినిమా ఫలితాన్ని చూసి చాలా మంది కూడా తమ సినిమా లపై నమ్మకం ఉంటే ప్రీమియర్ షో లు వేసుకోవడం ఖాయం.ఇలా ప్రీమియర్ షో లు వేయడం ద్వారా భారీ ఎత్తున పాజిటివ్ టాక్ విస్తరిస్తుంది.
అందుకే ఇలా చేయడం మంచి పని అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.