వలస నేతలపైనే బీజేపీ ఆశలు ! వారికే ఈ టికెట్లు 

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు బిజెపికి( BJP ) ఇబ్బందికరంగా మారాయి.ముఖ్యంగా పార్టీకి చెందిన కీలక నేతలు ఎంతోమంది ఇప్పటికే కాంగ్రెస్ ( Congress )కండువా కప్పుకోవడంతో,  బలంగా ఉన్న చాలా నియోజకవర్గాల్లో పార్టీ బలహీన పడింది.

 Bjp Hopes On Migrant Leaders! These Tickets Are For Them , Telangana Elections,-TeluguStop.com

కీలకమైన ఎన్నికల సమయంలో ఈ పరిణామాలు పార్టీలో ఆందోళన కలిగిస్తున్నాయి.పెద్ద ఎత్తున పార్టీ నేతలు ఇతర పార్టీలలో చేరిపోవడం తో చాలా నియోజకవర్గాల్లో పోటీకి దింపేందుకు అభ్యర్థులే కరువయ్యారు.

తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 52 మందితో కూడిన తొలి జాబితాను బిజెపి విడుదల చేసింది .రెండో జాబితా విడుదల చేసినప్పటికీ కేవలం ఒకే ఒక్క పేరు ఉండడంతో రకరకాల ప్రచారాలు తెరపైకి వస్తున్నాయి.ఎన్నికల్లో పోటీ చేసేందుకు బలమైన నేతలు లేకపోవడంతోనే బిజెపికి ఈ పరిస్థితి ఏర్పడిందని, అందుకే రెండో జాబితాలో కేవలం ఒక్క పేరు ప్రకటించారని తెలంగాణ రాజకీయ వర్గల్లో ప్రచారం జరుగుతోంది.

Telugu Telangana-Politics

దీనికి తగ్గట్లుగానే తెలంగాణ బిజెపి కూడా వలస నేతలపై ఎక్కువగా ఆశలు పెట్టుకుంది.కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలలో టిక్కెట్లు దక్కని అసంతృప్తి నేతలను గుర్తించి తమ పార్టీలో చేరాల్సిందిగా మంతనాలు చేపట్టింది.చేరికల కమిటీతో సంబంధం లేకుండా కీలక నేతలను పోటీకి దించేందుకు సిద్ధమవుతోంది.

ముఖ్యంగా హుస్నాబాద్ నుంచి ప్రవీణ్ రెడ్డి( Praveen Reddy ) , మునుగోడు నుంచి చలామల కృష్ణారెడ్డి( Chalamala Krishna Reddy ), హైదరాబాద్ జూబ్లీహిల్స్ నుంచి పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి ( Vishnuvardhan Reddy )కొంతమంది నేతలతో బిజెపి నేతలు సంప్రదింపులు చేస్తున్నారు .వీరంతా పార్టీలో చేరే అవకాశం ఉందని బిజెపి అంచనా వేస్తోంది.మరికొన్ని స్థానాల్లోనూ ఇతర పార్టీలోని బలమైన నేతలను పార్టీలోకి ఆహ్వానించి వారిని పోటీకి దించే ఆలోచనలు ఉంది.వీరి విషయంలో పూర్తిగా క్లారిటీ తీసుకోవాలని నిర్ణయించింది .ఇక మిగిలిన స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పైన పార్టీ కీలక నేతలంతా సమావేశం అయ్యారు.ఈరోజు కీలక నేతలు ఢిల్లీకి వెళ్తున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube