భారత్ టాప్ ఆర్డర్ ఘోర విఫలం.. అద్భుతం చేసి గెలిపించింది వాళ్లే..!

భారత్-ఇంగ్లాండ్ ( India-England )మ్యాచ్ అనంతరం భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma )విజయం పై స్పందిస్తూ.భారత టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలం అయిందని, భారత పేసర్లతో పాటు స్పిన్నర్లు అద్భుతం చేసి ఈ విజయాన్ని అందించారని రోహిత్ శర్మ తెలిపాడు.

 India's Top Order Failed Miserably.. They Did A Miracle And Won , India , En-TeluguStop.com

జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు అనుభవజ్ఞులైన తమ జట్టు ఆటగాళ్లంతా సమిష్టిగా పోరాడి జట్టును గెలిపించేందుకు ముందుంటారని, ఈ మ్యాచ్ తో మరోసారి రుజువైందని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

ఇంగ్లాండ్ అద్భుతమైన బౌలింగ్ తో తమను కట్టడి చేసే ప్రయత్నం చేసింది.

తమ జట్టు బ్యాటింగ్ అంత గొప్పగా లేదని, ఆరంభంలోనే తమ జట్టు మూడు వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిందని, తనతో పాటు అంతా ఆఖరి వరకు కాస్త పోరాడి ఉంటే బాగుండేదని చెప్పాడు.తమ జట్టు కనీసం 250 పరుగులు నమోదు చేసి ఉంటే బాగుండేదని తాను అనుకున్నట్లు చెప్పాడు.

స్వల్ప లక్ష్య చేదనకు దిగిన ఇంగ్లాండ్ జట్టు ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు కోల్పోవడం, దీంతో ప్రత్యర్థి పై ఒత్తిడి పెంచగలగడం తమకు సానుకూలాంశం.తమ పేసర్లు నిజంగా అద్భుతం చేయడం వల్లే మ్యాచ్ గెలిచామని తెలిపాడు.

Telugu India England, Jasprit Bumrah, Kuldeep Yadav, Rohit Sharma-Sports News �

భారత జట్టు బ్యాటింగ్ విషయానికి వస్తే. రోహిత్ శర్మ( Rohit Sharma ) 87, కేఎల్ రాహుల్ 39, సూర్యకుమార్ యాదవ్ ( Suryakumar Yadav )49 పరుగులతో రాణించడం వల్ల భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది.

Telugu India England, Jasprit Bumrah, Kuldeep Yadav, Rohit Sharma-Sports News �

భారత జట్టు పేసర్లైన మహమ్మద్ షమీ 4, జస్ప్రీత్ బుమ్రా( Jasprit Bumrah ) 3 వికెట్లు తీశారు.స్పిన్నర్ల విషయానికి వస్తే కుల్దీప్ యాదవ్ 2, 9 , ( Kuldeep Yadav )రవీంద్ర జడేజా ఒక వికెట్ తీశారు.దీంతో ఇంగ్లాండ్ 129 పరుగులకే కుప్పకూలింది.100 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ ఈ టోర్నీలో ఓటమి అనేది లేకుండా ఆరవ విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

భారత జట్టు టాప్ ఆర్డర్ సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లలో తప్పకుండా రాణించాలి.బౌలర్లపై ఒత్తిడి పడితే ఒక్కోసారి సానుకూల ఫలితాలు రాకపోవచ్చు.భారత్ 2023 టోర్నీ గెలవాలంటే.జట్టులో ఉండే ప్రతి ఆటగాడు అద్భుత ఆటను ప్రదర్శించాలని, ముఖ్యంగా బ్యాటర్లు రాణించాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube