సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీల ఇళ్లల్లో వరుసగా చోరీలు జరుగుతున్నాయి.ఎప్పటినుంచో పని చేస్తూ నమ్మకంగా ఉండే పనివారు ఇంట్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు.
అలాంటి వాళ్లకు సదరు సెలబ్రిటీలు కూడా తగిన విధంగా బుద్ధి చెపుతున్నారు.తాజాగా కూడా ఒక ప్రముఖ నటుడి ఇంట్లో దొంగతనం( Theft in Celebrities House ) జరిగింది.
కొన్ని నెలల నుంచి ఇంట్లో పనులు చేస్తున్న ఒక ఆమె లక్షలు విలువ చేసే డబ్బు, బంగారం తీసుకుని జంప్ అయిపోయింది.ప్రస్తుతం ఈ విషయమై సదరు నటుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఆమె పనిమనిషి కాదు.దొంగతనంలో ఎలా ముదిరిపోయిందనేది కూడా సదరు నటుడు బయటపెట్టాడు.
ఆ నటుడు మారెవరో కాదు మరాఠీ నటుడు పుష్కర్ ష్రోత్రి( Pushkar Shrotri ). ఇతని ఇంట్లో ముగ్గురు పనివాళ్లు ఉన్నారు.ఇంటిపనులు చూసుకోవడంతో పాటు అతని తండ్రి బాగోగులని చూసుకోవడం వాళ్ల పని.కానీ ఇందులో ఉష 41 ఏళ్ళ మహిళ మాత్రం 5-6 నెలల నుంచి పుష్కర్ ఇంట్లో పనిచేస్తోంది.ఈమెనే పుష్కర్ ఇంట్లో ఉన్న రూ.1.20 లక్షలు డబ్బులు, 60 వేల విదేశీ కరెన్సీ, అక్టోబరు 22న దొంగతనం చేసింది.కానీ అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఈ మొత్తం యజమానికి తిరిగొచ్చేసింది.
ఈ సంఘటన జరిగిన రెండు రోజుల తర్వాత అంటే అక్టోబరు 24న బంగారం విషయంలోనూ పుష్కర్ దంపతులకు ఎందుకో అనుమానమొచ్చింది.
బీరువాలో బంగారం ఉన్నా సరే దాన్ని పరిశీలించి చూడగా, అది నకిలీది అని తేలింది.పనిమనిషి ఉష( Maid Usha )నే రూ.10 లక్షలు విలువ చేసే బంగారంతో ఆల్రెడీ పరార్ అయిపోయినట్లు బయటపడింది.దీంతో పుష్కర్, అక్టోబరు 26న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ప్రస్తుతం వాళ్లు దర్యాప్తు చేస్తున్నారు.ఇప్పుడు కాస్త ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.