ఘనంగా హీరో అర్జున్ కుమార్తె ఐశ్వర్య నిశ్చితార్థం... ఫోటోలు వైరల్!

ప్రముఖ నటుడు అర్జున్‌ ( Arjun )పెద్ద కుమార్తె ఐశ్వర్య త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు.కోలీవుడ్‌ సీనియర్‌ నటుడు, దర్శకుడు తంబి రామయ్య (Thambi Ramaiah) కుమారుడు, హీరో ఉమాపతి ( Umapathy Ramaiah )తో ఆమె ఏడడుగులు వేయనున్నారంటూ గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.

 Hero Arjun Sarja Daughter Aishwarya Engagement Photos Goes Viral In Social Media-TeluguStop.com

ఇలా వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని వీరి ప్రేమ విషయం వీరి పెద్దలకు తెలియడంతో వీరి పెళ్లికి అనుమతి ఇచ్చారు అంటూ కూడా వార్తలు వచ్చాయి.ఈ విధంగా అర్జున్ కుమార్తె ఐశ్వర్య ప్రేమ గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చినప్పటికీ ఎక్కడా కూడా అర్జున్ స్పందించలేదు.

Telugu Aishwarya, Arjun, Thambi Ramaiah, Umapathy-Movie

అయితే తాజాగా అర్జున్ తన కుమార్తె ఐశ్వర్య ( Aishwarya Arjun) కు ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరిపించారని తెలుస్తోంది.తాను ప్రేమించినటువంటి వ్యక్తి ఉమాపతి తోనే తన కుమార్తె నిశ్చితార్థం ( Aishwarya Arjun Engagement ) ఎంతో ఘనంగా జరిపించారని తెలుస్తుంది.ప్రస్తుతం వీరి నిశ్చితార్థానికి సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.వీరిద్దరి నిశ్చితార్థం శుక్రవారం చెన్నై( Chennai )లో కుటుంబ సభ్యులు అత్యంత సినీ ప్రముఖుల సమక్షంలో జరిగిందని తెలుస్తుంది.

అయితే వీరి నిశ్చితార్థానికి సంబంధించినటువంటి ఫోటోలను కుటుంబం కానీ తంబి రామయ్య కుటుంబం కాని సోషల్ మీడియాలో షేర్ చేయలేదు.

Telugu Aishwarya, Arjun, Thambi Ramaiah, Umapathy-Movie

అయితే వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు( Aishwarya Arjun Engagement Photos ) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందరూ షాక్ అవుతున్నారు.అదేంటి స్టార్ హీరోలు అందరూ ఏమాత్రం చడి చప్పుడు లేకుండా తమ కూతుర్ల నిశ్చితార్థం చేస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు.గత రెండు రోజుల క్రితం హీరో వెంకటేష్ కూడా తన రెండవ కుమార్తె నిశ్చితార్థం కూడా ఇలా సైలెంట్ గా జరిగిపోయిన సంగతి తెలిసిందే.

ఏది ఏమైనా అర్జున్ కుమార్తె ఐశ్వర్య తాను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోబోతున్నటువంటి నేపథ్యంలో అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube