భారత జట్టు స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ( Virat Kohli ) ఈ వన్డే వరల్డ్ కప్ లో అద్భుత ఆటను ప్రదర్శిస్తూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు.తాజాగా భారత్-బంగ్లాదేశ్( India-Bangladesh ) మధ్య జరిగిన మ్యాచ్ లో సెంచరీ తో అదరగొట్టి పలు రికార్డులు సృష్టించాడు అవేమిటో చూద్దాం.
అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సార్లు 50+ పరుగులు చేసిన నాల్గవ ఆటగాడిగా విరాట్ కోహ్లీ (212) నిలిచాడు.ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 264తో అగ్రస్థానంలో ఉండగా.
ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం రికీ పాంటింగ్ 217 తో రెండవ స్థానంలో.శ్రీలంక మాజీ దిగ్గజం కుమార సంగక్కర( Kumar Sangakkara ) 216 తో మూడవ స్థానంలో ఉన్నారు.
తాజాగా జరిగిన మ్యాచ్ తో విరాట్ కోహ్లీ 212తో నాలుగవ స్థానానికి ఎగబాకాడు.
తాజాగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ తో ఖాతాలో వేసుకున్న పలు రికార్డులు ఇవే.వన్డేల్లో 48వ సెంచరీ, ఓవరాల్ గా అంతర్జాతీయ క్రికెట్ లో చూసుకుంటే 78వ సెంచరీ నమోదు చేశాడు.కోహ్లీ తాజాగా చేసిన 103 పరుగులతో అంతర్జాతీయ క్రికెట్లో 26 వేల పరుగుల మైలురాయిని దాటాడు.26 వేల పరుగుల మైలురాయిని దాటిన ఆటగాళ్ల విషయానికి వస్తే.సచిన్ టెండూల్కర్( Sachin Tendulkar ) 34357 పరుగులతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.
కుమార సంగక్కర 28016 పరుగులతో రెండవ స్థానంలో ఉన్నాడు.రికీ పాంటింగ్ 27483 పరుగులతో మూడవ స్థానంలో ఉన్నాడు.
తాజాగా విరాట్ కోహ్లీ 26026 పరుగులతో నాలుగో స్థానంలో నిలిచాడు.విరాట్ కోహ్లీ 26 వేల పరుగుల మైలురాయిని అందరికంటే తక్కువ ఇన్నింగ్స్ (567) లలో చేరుకోవడం విశేషం.
ఈ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ