తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఛార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయం వద్దకు కాంగ్రెస్ రెబల్స్ చేరుకున్నారు.ఈ క్రమంలో ప్రమాణం చేసేందుకు కురువ విజయ్ కుమార్, రాగిడి లక్ష్మారెడ్డి వెళ్లారు.
రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకున్నారని తాము ప్రమాణం చేస్తామని రెబల్స్ విజయ్ కుమార్, లక్ష్మారెడ్డి తెలిపారు.ఈ నేపథ్యంలో తాను టికెట్లు అమ్ముకోలేదని ప్రమాణం చేసేందుకు అమ్మవారి ఆలయం వద్దకు రావాలని రెబల్స్ డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి హఠావో కాంగ్రెస్ బచావో అనే నినాదంతో ముందుకెళ్తున్నామన్నారు.రేవంత్ రెడ్డికి దమ్ముంటే భాగ్యలక్ష్మీ ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలన్నారు.
రేవంత్ రెడ్డి దొంగ అన్న రెబల్స్ తన గూండాలతో చంపుతామని బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.కాంగ్రెస్ పార్టీని నాశనం చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారన్న కాంగ్రెస్ రెబల్స్ భరతం పడతామని స్పష్టం చేశారు.