కాంగ్రెస్ కు షాక్ ఇవ్వండి : తెలంగాణ ప్రజలకు కేసీఆర్ పిలుపు!

కాంగ్రెస్ ( Congress )కు షాక్ ఇవ్వాలంటూ పిలుపునిచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM kcr ).జనగామలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడుతూ ఆయన అనేక కీలక వ్యాఖ్యలు చేశారు.

 Give A Shock To The Congress Kcr's Call To The People Of Telangana , Congress-TeluguStop.com

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ్య గోచరంగా ఉండేదని, దీనిపై అనేక మంది ఆర్థిక నిపుణులను పిలిపించి అభివృద్ధికి ప్రణాళికలు రచించామని కెసిఆర్ చెప్పుకొచ్చారు.పల్లా రాజశేఖర్ రెడ్డిని( Palla Rajasekhar Reddy ) మరోసారి గెలిపిస్తే చిర్యాల ను రెవెన్యూ డివిజన్ గా మారుస్తామంటూ ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు.

ఒకప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా ఇతర దేశాలకు పొట్టకూటి కోసం వలస వెళ్లే యువత కనిపించేదని ఇప్పుడు 365 రోజులు అందుబాటులో ఉన్న సాగు నీళ్లతో రెండు నెలలపాటు అనేక లారీల్లో దాన్యం తరలి వెళ్లే పరిస్థితిలు వచ్చాయని, రైతుకే అధికారం ఉండే విధంగా ధరణి పోర్టల్ తీసుకొస్తే మళ్లీ దళారుల మీద ఆధారపడే వ్యవస్థను తీసుకురావడానికి కాంగ్రెస్ చూస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మరోసారి రైతుల కు కరెంటు షాక్ లు తప్పవని అందువల్ల కాంగ్రెస్ కే షాక్ ఇవ్వమంటూ ఆయన తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు.

Telugu Cm Kcr, Congress, Pallarajasekhar, Revanth Reddy-Telugu Political News

వోటు చాలా అమూల్యమైనదని మనం ఎవరికి వేస్తామో మన తలరాత అలానే ఉంటుందని కాబట్టి ఆలోచించి ఓటు వేయాలంటూ ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు రానున్న రోజులలో జనగామకు పారిశ్రామికంగా, ఐటి పరంగా అనేక అభివృద్ధి అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ కు సమీపంలో ఉన్నందున పారిశ్రామికంగా చాలా అభివృద్ధి చెంది అవకాశం ఉందని ఉద్యోగాల కోసం ఇక్కడ యువత ఏ దేశానికి వలస వెళ్లాల్సిన కర్మ ఇక మనకు లేదంటూ ఆయన చెప్పుకొచ్చారు.

Telugu Cm Kcr, Congress, Pallarajasekhar, Revanth Reddy-Telugu Political News

రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని అనుకూల వాతావరణ ఉన్నందుకే విదేశాల నుంచి పెట్టుబడులు తరలివస్తున్నాయని ఇక్కడ మతసామరస్యంతో తెలంగాణ వర్ధిల్లుతుంటే కొంతమంది మతం పేరుతో మారణ హోమం సృష్టించడానికి తయారయ్యారని అలాంటి వారికి అవకాశం ఇవ్వొద్దు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. గణేష్ నిమజ్జనం రోజునే మిలాన్ ఉన్ నబీ వస్తే ఎవరూ అడగకుండానే ఆ మత పెద్దలు ఒకరోజు వాయిదా వేసుకున్నారని తెలంగాణలో అలాంటి సామరస్య పూర్వక వాతావరణ ఉందంటూ ఆయన చెప్పుకొచ్చారు .ఒకప్పుడు భువనగిరిలో కరువు ( Congress )తాండవించేదని తెలంగాణ అంటూ ఏర్పడకపోతే అసలు భువనగిరి జిల్లా అయ్యే అవకాశం కూడా వచ్చి ఉండేది కాదని ఈ ప్రాంతంలో కాంగ్రెస్ అరాచక శక్తులను పెంచి పోషించిందని తాము వచ్చిన తర్వాతే ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారిందంటూ ఆయన వాఖ్యనించారు ఆపద్ధర్మ మొక్కులు మొక్కే వారిని నమ్మవద్దు అంటూ ఆయన తెలంగాణ ప్రజలకు హితవు పలికారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube