ఇజ్రాయెల్‌లో ఎన్నారై సెక్యూరిటీ ఆఫీసర్స్ మృతి.. విధి నిర్వహణలో ప్రాణ త్యాగం...

ఇజ్రాయెల్‌లో( Israel ) భద్రతా అధికారులుగా పనిచేస్తున్న ఇద్దరు భారతీయ సంతతికి చెందిన మహిళలు మృతి చెందారు.ఈ నెల ప్రారంభంలో హమాస్( Hamas ) జరిపిన ఉగ్రదాడిలో వారు మరణించారు.

 2 Indian-origin Israeli Women Security Officers Killed In Hamas Assault Details,-TeluguStop.com

అధికారులు, వారి సంఘంలోని వ్యక్తులు ఆదివారం ఈ చేదు సంఘటన గురించి వెల్లడించారు.చనిపోయిన వారిలో ఒకరు అష్డోద్‌కు చెందిన హోమ్ ఫ్రంట్ కమాండ్‌లో కమాండర్ అయిన 22 ఏళ్ల ఓర్ మోసెస్.

( Or Moses ) మరొకరు కిమ్ డోక్రాకర్.( Kim Dokraker ) కిమ్ పోలీసు సెంట్రల్ డిస్ట్రిక్ట్‌లోని బోర్డర్ పోలీసు అధికారిగా పని చేస్తున్నారు.

వీరిద్దరూ యుద్ధంలో తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ అమరులయ్యారు.

Telugu Gas, Hamas, Hamas Israel, Indianorigin, Indian Origin, Israel, Kim Dokrak

ఈ ఘర్షణలో ఇప్పటి వరకు 286 మంది ఆర్మీ సైనికులు, 51 మంది పోలీసు అధికారులు మరణించారని అధికారులు తెలిపారు.ఇజ్రాయెల్ ఇప్పటికీ మృతులను గుర్తించడం, తప్పిపోయిన లేదా కిడ్నాప్ అయిన వారి కోసం వెతుకుతున్నందున ఎక్కువ మంది బాధితులు ఉండవచ్చు.అయితే ఇక్కడ జరుగుతున్న దారుణాతి దారుణాల గురించి చాలామంది మీడియాతో పంచుకుంటున్నారు.

ఈ క్రమంలోనే దాడి నుండి ప్రాణాలతో బయటపడిన షాహాఫ్ టాకర్( Shahaf Talker ) అనే యువతి తన తాతకు కొన్ని షాకింగ్ విషయాల గురించి తెలియజేసింది.

Telugu Gas, Hamas, Hamas Israel, Indianorigin, Indian Origin, Israel, Kim Dokrak

ఆమె చాలా దిగ్భ్రాంతి చెందిందని, మాట్లాడటానికి చాలా బాధగా ఉందని, అందుకే లెటర్ రాస్తూ ఆ రోజు తనకు ఏమి జరిగిందో చెప్పిందని తాత వెల్లడించారు, 1963లో 11 సంవత్సరాల వయస్సులో ముంబై నుంచి ఇజ్రాయెల్‌కు మారిన ఆమె తాత యాకోవ్ టాకర్( Yaacov Talker ) తన మనవరాలు చెప్పిన అనేక విషయాలను మీడియాతో పంచుకున్నారు.ఆయన చెప్పిన ప్రకారం, షాహాఫ్ దాడిలో మరణించిన తన స్నేహితుల అంత్యక్రియలకు వెళ్లింది.అక్టోబరు 7న తాను, తన స్నేహితుడు యానిర్‌తో కలిసి ఓ సంగీత విందులో పాల్గొనగా ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించిన హమాస్ ఉగ్రవాదులు ఆమె కళ్ళ ముందే దాదాపు 270 మంది యువకులను హతమార్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube