వైరల్: రూపాయి ఖర్చులేని సూపర్ ఐడియా.. అదిరింది గురూ!

సిటీలలో జీవించేవారికి అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.ఏది కావాలన్నా వెంటనే దొరికేస్తుంది.

 Viral Video Pune Boy Unique Zomato Order Solves Commute Struggles Details, Super-TeluguStop.com

ప్రతీది కూడా అందుబాటులో ఉంటుంది.కానీ సిటీలలో జనాభా ఎక్కువగా ఉంటుంది గనుక క్యాబ్ లు, ఆటోలు సమయానికి దొరకవు.

కొన్నిసార్లు గంటపాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది.క్యాబ్ లు, ఆటోలు ఎప్పుడూ బిజీగా ఉంటాయి.

ఇక రాత్రి సమయాల్లో అయితే క్యాబ్ లు( Cabs ) వెంటనే దొరకవు.ఒక యువకుడికి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది.

సమయానికి ఇంటికి వెళ్లేందుకు క్యాబ్స్ దొరకలేదు.

చివరికి యువకుడికి ఒక ఆలోచన వచ్చింది.రెస్టారెంట్ కి వెళ్లి జొమాటో యాప్ లో( Zomato ) పిజ్జా ఆర్డర్ పెట్టాడు.తన ఇంటి అడ్రస్ కు డెలివరీ అయ్యేలా పిజ్జా ఆర్డర్ పెట్టాడు.

డెలివరీ బాయ్( Delivery Boy ) పిజ్జా తీసుకునేందుకు రెస్టారెంట్ వద్దకు రాగా.తానే ఆర్డర్ పెట్టానని, తాను కూడా నీతో పాటు బైక్ పై ఇంటి వద్దకు వస్తానని చెప్పాడు.

దీంతో జొమాటో డెలివరీ బాయ్ యువకుడిని కూడా బైక్ పై తీసుకెళ్తాడు.ఇంటికెళ్లిన తర్వాత జొమాటో డెలివరీ బాయ్ కి థ్యాంక్స్ చెప్పిన యువకుడు.

అతడికి కూడా పిజ్జా తినిపించాడు.

మహారాష్ట్రలోని పూణెకు చెందిన యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ సార్థక్ సచ్ దేవా( Sarthak Sachdeva ) ఇలా తన తెలివితో ఇంటికి చేరుకున్నాడు.ఇటీవల ఒక ప్రాంతానికి సార్థక్ వెళ్లాడు.తిరిగి ఇంటికెళ్లేందుకు బైక్, ఆటో, కారు కోసం యాప్స్ లో చూశాడు.

కానీ చాలాసేపటి వరకు ఏది బుక్ అవ్వలేదు.దీంతో దగ్గరలోని ఓ రెస్టారెంట్ కు వెళ్లి కూర్చున్నాడు.

అక్కడ ఆ రెస్టారెంట్ పేరును జోమాటో యాప్ లో సెర్చ్ చేసి తన ఇంటి అడ్రస్ పెట్టి పిజ్జా ఆర్డర్ పెట్టాడు.ఇలా డెలివరీ బాయ్ సాయంతో ఇంటికి చేరాడు.

సార్థక్ తెలివిని చూసి అందరూ మెచ్చుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube