'గుంటూరు కారం' పాన్ ఇండియా రిలీజ్ ఉందా.. నిర్మాత క్లారిటీ!

సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) ఏ సినిమా చేస్తున్న ఆ సినిమా నుండి కొత్త అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు.ఈయన సినిమాలకు అంత క్రేజ్ ఉంది అనే చెప్పాలి.

 Guntur Kaaram Movie Latest Update, Guntur Kaaram, Mahesh Babu, Trivikram, Pooja-TeluguStop.com

మరి సర్కారు వారి పాట వంటి సూపర్ హిట్ తర్వాత మహేష్ బాబు చేస్తున్న మరో మూవీ ”గుంటూరు కారం”.ఈ సినిమాపై ఇప్పటికే బోలెడన్ని హోప్స్ పెరిగి పోయాయి.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తుండగా శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తున్నారు.ఇక హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.భారీ మాస్ యాక్షన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే దాదాపు సగం షూటింగ్ పూర్తి చేసుకుంది.

ఇదిలా ఉండగా ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్( Pan India Release ) ఉంటుందో లేదో అనే విషయంలో ప్రేక్షకులకు ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు.దీంతో ఫ్యాన్స్ తమ హీరో మూవీ పాన్ ఇండియా రేస్ లో ఉంటుందో లేదో అని క్లారిటీ అడుగుతున్నారు.

మరి అలాంటి క్లారిటీ ఇప్పుడు నిర్మాత ఇచ్చారు.గుంటూరు కారం నిర్మాత సూర్యదేవర నాగవంశీ( Producer Suryadevara Nagavamsi ) తాజాగా స్పందించారు.

ఈయన తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.ఈ సినిమా అయితే తెలుగు వర్షన్ లోనే రిలీజ్ చేసే ఆలోచన ఉందని ఇతర భాషాల్లో రిలీజ్ చేసే ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చారు.దీంతో గుంటూరు కారం( Guntur Karam ) కేవలం తెలుగు వర్షన్ లోనే రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.చూడాలి ఈ ఒక్క భాషలో అయినా ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్స్ రాబడుతుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube