Meenakshi Chowdary : సైలెంట్ కిల్లర్ అఫ్ సౌత్ సినిమా .. శ్రీలీల తర్వాత సూపర్ బిజీ గా మీనాక్షి చౌదరి

ఈ మధ్య కాలంలో ఎక్కడ చుసిన శ్రీలీల( Sreeleela ) పేరు బాగా మారు మోగిపోతుంది.కానీ సినిమా అంటే ఆమె ఒక్కతే కాదు కదా.

 Meenakshi Chowdary Back To Back Movies In Telugu-TeluguStop.com

బోలెడన్ని సినిమాలు, అంతకు మించిన హీరోయిన్స్.అందుకే శ్రీలీల తర్వాత స్థానాన్ని చాల సైలెంట్ గా ఇప్పుడు ఒక హీరోయిన్ రీప్లేస్ చేస్తుంది.

ఇంతకు ఆ హీరోయిన్ ఎవరు ? ఆమె చేస్తున్న సినిమాలు ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Telugu Adivi Sesh, Mahesh Babu, Sreeleela, Tollywood, Vishwak Sen-Telugu Top Pos

ఆ హీరోయిన్ మరెవరో కాదు మీనాక్షి చౌదరి.( Meenakshi chowdary ) తెలుగు లో ఆమె నటించిన రెండు సినిమాలు కూడా పరాజయం పొందడం తో ఆమె గురించి ఎవరు పెద్దగా పట్టించుకోలేదు.కానీ మహేష్ బాబు సినిమాలో స్థానం సంపాదించుకోవడం తో ప్రస్తుతం టాలీవుడ్ చూపు ఆమెపై పడింది.

వాస్తవానికి మీనాక్షి చౌదరి సుశాంత్ హీరోగా నటించిన ఇచట వాహనములు నిలపరాదు అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.కానీ ఈ సినిమా ప్లాప్ అయ్యింది.ఆ తర్వాత రవితేజ ఖిలాడీ సినిమాలో సైతం నటించిన ఎవరు ఈమెను గుర్తించలేదు

Telugu Adivi Sesh, Mahesh Babu, Sreeleela, Tollywood, Vishwak Sen-Telugu Top Pos

అడవి శేష్ హిట్ 2 లో హీరోయిన్ గా కూడా నటించిన మీనాక్షికి పెద్దగా అవకాశాలు తలుపు తట్టలేదు.అయితే గుంటూరు కారం సినిమా నుంచి పూజ హెగ్డే తప్పుకోవడం తో అప్పటి వరకు సెకండ్ హీరోయిన్ గా ఉన్న శ్రీలీల ఆమె స్థానంలోకి వెళ్ళిపోయింది.ఇక శ్రీలీల స్థానాన్ని త్రివిక్రమ్( Trivikram Srinivas ) మీనాక్షి చౌదరి తో భర్తీ చేసాడు.దాంతో మీనాక్షిని తెలుగు సినిమా ఇండస్ట్రీ గుర్తించడం మొదలు పెట్టింది.

ఇదే ఊపులో విశ్వక్ సేన్ సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా నటించడానికి సైన్ చేసింది.ఇక మట్కా సినిమాలో కూడా మీనాక్షి నటిస్తుండగా సింగపూర్ సెలూన్ అనే ఒక తమిళ సినిమాలో కూడా నటిస్తుంది.

మొత్తానికి త్రివిక్రమ్ పుణ్యమా అని ఈ అమ్మడి చేతిలో సినిమాలు బాగానే ఉన్నాయ్.పైగా అందాలకు ఎలంటూ హద్దులు లేకపోవడం కూడా మీనాక్షికి బాగానే కలిసి వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube