Meenakshi Chowdary : సైలెంట్ కిల్లర్ అఫ్ సౌత్ సినిమా .. శ్రీలీల తర్వాత సూపర్ బిజీ గా మీనాక్షి చౌదరి
TeluguStop.com
ఈ మధ్య కాలంలో ఎక్కడ చుసిన శ్రీలీల( Sreeleela ) పేరు బాగా మారు మోగిపోతుంది.
కానీ సినిమా అంటే ఆమె ఒక్కతే కాదు కదా.బోలెడన్ని సినిమాలు, అంతకు మించిన హీరోయిన్స్.
అందుకే శ్రీలీల తర్వాత స్థానాన్ని చాల సైలెంట్ గా ఇప్పుడు ఒక హీరోయిన్ రీప్లేస్ చేస్తుంది.
ఇంతకు ఆ హీరోయిన్ ఎవరు ? ఆమె చేస్తున్న సినిమాలు ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
""img Src="https://telugustop!--com/wp-content/uploads/2023/10/meenakshi-chowdary-Sreeleela-Mahesh-Babu-tollywood-Trivikram-Srinivas-Ai-Sesh-Hit-2!--jpg" /
ఆ హీరోయిన్ మరెవరో కాదు మీనాక్షి చౌదరి.( Meenakshi Chowdary ) తెలుగు లో ఆమె నటించిన రెండు సినిమాలు కూడా పరాజయం పొందడం తో ఆమె గురించి ఎవరు పెద్దగా పట్టించుకోలేదు.
కానీ మహేష్ బాబు సినిమాలో స్థానం సంపాదించుకోవడం తో ప్రస్తుతం టాలీవుడ్ చూపు ఆమెపై పడింది.
వాస్తవానికి మీనాక్షి చౌదరి సుశాంత్ హీరోగా నటించిన ఇచట వాహనములు నిలపరాదు అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
కానీ ఈ సినిమా ప్లాప్ అయ్యింది.ఆ తర్వాత రవితేజ ఖిలాడీ సినిమాలో సైతం నటించిన ఎవరు ఈమెను గుర్తించలేదు ""img Src="https://telugustop!--com/wp-content/uploads/2023/10/meenakshi-chowdary-Sreeleela-Mahesh-Babu-tollywood-Trivikram-Srinivas-Ai-Sesh-Hit-2-Vishwak-Sen!--jpg" /
అడవి శేష్ హిట్ 2 లో హీరోయిన్ గా కూడా నటించిన మీనాక్షికి పెద్దగా అవకాశాలు తలుపు తట్టలేదు.
అయితే గుంటూరు కారం సినిమా నుంచి పూజ హెగ్డే తప్పుకోవడం తో అప్పటి వరకు సెకండ్ హీరోయిన్ గా ఉన్న శ్రీలీల ఆమె స్థానంలోకి వెళ్ళిపోయింది.
ఇక శ్రీలీల స్థానాన్ని త్రివిక్రమ్( Trivikram Srinivas ) మీనాక్షి చౌదరి తో భర్తీ చేసాడు.
దాంతో మీనాక్షిని తెలుగు సినిమా ఇండస్ట్రీ గుర్తించడం మొదలు పెట్టింది.ఇదే ఊపులో విశ్వక్ సేన్ సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా నటించడానికి సైన్ చేసింది.
ఇక మట్కా సినిమాలో కూడా మీనాక్షి నటిస్తుండగా సింగపూర్ సెలూన్ అనే ఒక తమిళ సినిమాలో కూడా నటిస్తుంది.
మొత్తానికి త్రివిక్రమ్ పుణ్యమా అని ఈ అమ్మడి చేతిలో సినిమాలు బాగానే ఉన్నాయ్.
పైగా అందాలకు ఎలంటూ హద్దులు లేకపోవడం కూడా మీనాక్షికి బాగానే కలిసి వచ్చింది.
గేమ్ ఛేంజర్ మూవీ మరో రివ్యూ వైరల్.. ఈ సినిమా హైలెట్ సన్నివేశాలు ఇవే!