తెలంగాణ రాష్ట్రంపై ప్రధాన నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi ) ఇచ్చిన హామీలపై తెలంగాణ ప్రజలేవ్వరికి నమ్మకం లేదని నమో అంటే నమ్మించి మోసం చేయటమని తెలంగాణ ప్రజలకు తెలుసంటూ వ్యాఖ్యానించారు బారసా జాతీయ కార్యదర్శి కల్వకుంట్ల తారక రామారావు( Kalvakuntla Taraka Rama Rao ).తమ కారు స్టీరింగ్ ఎవరి చేతుల్లోనూ లేదని తమ అధినేత కేసిఆర్( KCR ) చేతుల్లోనే ఉందని భాజాపాస్టీరింగ్ మాత్రం అదాని చేతుల్లోకి మారిపోయింది అంటూ మోడీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు .72 వేల కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లోకి వేసిన నిజం బహిరంగంగా కనిపిస్తూ ఉంటే ఇంకా రుణమాఫీ జరగలేదని సిల్లీ మాటలు ఆయన స్థాయికి తగదు అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.తన కార్పొరేట్ స్నేహితులకు 14.5 లక్షల కోట్ల రుణాలను రద్దు చేసిన నహి కిసాన్ సర్కార్ ( Nahi Kisan Sarkar )మీదని , రైతు గొంతుకు కోసిన హంతకరాజ్యం మీద అంటూ తీవ్ర వాఖ్యలు చేశారు.విభజన హామీలను గాలికి వదిలేసి ఇప్పుడు ఓట్ల వేటకు బయలుదేరిన మీ హామీలు ఇక్కడ ఎవరు నమ్మరని, ప్రాజెక్టుల వల్ల చుక్క అంద లేదనటం మీ అవివేకానికి నిదర్శనం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇక్కడ పండించిన ధాన్యం కొనుగోలు చేయలేక చేతులు ఎత్తేసిన మీరు రైతుల గురించి మాట్లాడతారా? భాజపాకు తెలంగాణలో నూకలు చెల్లిపోయాయంటూ వ్యాఖ్యానించారు.దశాబ్దాలుగా పెండింగ్లో పెట్టిన ప్రాజెక్టు ఉన్నప్పుడు ప్రకటించడం కేవలం ఎన్నికల తాయలాల కోసమేనని ఆచరణలో మాత్రం ఆ స్థాయి వేగం కనిపించవని చెప్పుకొచ్చారు .కనిపిస్తున్న తెలంగాణ( Telangana ) అభివృద్ధి కళ్ళ ముందు ఉంటే మసి పూసి మారేడు కాయలు చేసేలా ఉన్న మీ విధానాలను తెలంగాణ ప్రజలు నమ్మరు ఆయన వ్యాఖ్యానించారు మోడీ వాఖ్యలను మిని ట్ టు మినిట్ క్రాస్ చేసి మరి కేటీఆర్ కౌంటర్లు ఇచ్చారు.