టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అరెస్ట్ కావడంతో తెలుగుదేశం పార్టీ కాస్త బలహీనపడిందనే విషయం తెలిసిందే.అయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంతో టిడిపి నేతలు అంతా కూడా వచ్చే ఎన్నికలలో తమ ప్రభుత్వం కచ్చితంగా అధికారంలోకి వస్తుందని అప్పుడు జగన్మోహన్ రెడ్డికి(Jagan Mohan Reddy) భయం అంటే ఏంటో పరిచయం చేస్తాము అంటూ ప్రగల్బాలు పలుకుతున్నారు.
ఇక లోకేష్(Lokesh) పాదయాత్రలో కూడా ఇదే విషయాన్ని పలుసార్లు తెలియజేశారు.ఈ క్రమంలోనే టిడిపి నేతలు సీఎం జగన్ పట్ల చేసినటువంటి ఈ వ్యాఖ్యలపై శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి(Byreddy Siddhartha Reddy) స్పందించారు.

గుంటూరులో వినాయక చవితి నిమజ్జన కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.ఈ క్రమంలోనే ఈయన సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి తెలుగుదేశం పార్టీ నేతలు చేసినటువంటి వ్యాఖ్యలపై స్పందిస్తూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికి భయాన్ని పరిచయం చేస్తామని అవినీతిలో కూరుకుపోయిన వారు అంటుంటే చాలా హాస్యాస్పదంగా ఉందని ఆయన మాట్లాడారు.జగన్ కి భయం పరిచయం చేసేవారు ఏపీలో ఉండకుండా ఢిల్లీకు ఎందుకు వెళ్లారో అందరికీ తెలుసు అంటూ పరోక్షంగా లోకేష్ ని( Nara Lokesh ) ఉద్దేశించి ఈయన మాట్లాడారు.

చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ స్కాం( Skill Development Scam ) చాలా చిన్నదని ఈయన తెలిపారు.ఇన్నర్ రింగ్ రోడ్డు, అమరావతి భూముల విషయంలో పెద్ద ఎత్తున దోపిడీ జరిగిందని అయితే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఐటి పంచాయతీరాజ్ మంత్రిగా లోకేష్ ఉన్నారని ఈయన గుర్తు చేశారు.బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురందేశ్వరి(Purandeswari)వైఖరి ఏంటని ఆయన నిలదీశారు.ఇక పురుందేశ్వరి గురించి కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ ఆమె ముందు బిజెపి పార్టీ వైపు ఉన్నారా లేక తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారా అనే విషయం తెలుసుకొని మమ్మల్ని విమర్శిస్తే బాగుంటుంది అంటూ ఈ సందర్భంగా ఈయన టిడిపి నేతలు అలాగే పురందేశ్వరి గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.