ఈరోజుతో పాత పార్లమెంటు భవనం సేవలు ముగిశాయి.రేపటి నుంచి కొత్త పార్లమెంట్ భవనం( New Parliament Building )లో సమావేశాలు నడుస్తాయని లోక్ సభ స్పీకర్ హోమ్ బిర్లా( Lok Sabha Speaker Om Birla ) ప్రకటించారు.
సోమవారం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పాత పార్లమెంట్ భవనంలో ప్రారంభమయ్యాయి.ఈ క్రమంలో తొలిరోజు చివరి నిమిషంలో.
సభ ముగించే ముందర స్పీకర్ ఓం బిర్లా ఈ విషయం సభ్యులకు తెలియజేయడం జరిగింది.అనంతరం సభని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి రేపటి నుంచి కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు జరుగుతాయని పేర్కొన్నారు.
కాగా కొత్త పార్లమెంట్ భవనంలో మంగళవారం ఉదయం గణపతి పూజ( Ganapathi Pooja ) చేస్తారని తర్వాత మధ్యాహ్నం లోక్ సభ 1:15 నిమిషాలకు, రాజ్యసభ 2:15 నిమిషాలకు ప్రారంభం కాబోతుందట.ఈ కొత్త పార్లమెంట్ భవనంలో మొదట మహిళా రిజర్వేషన్ బిల్లునీ ఆమోదం పొందేలా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి గతంలో ఎన్నో పార్టీలు ప్రయత్నాలు చేయగా చివరకి కొత్త పార్లమెంటు భవనంలో మొదలు కాబోయే సమావేశాలలో బుధవారం ఆమోదం పొందుకోబోతున్నట్లు సమాచారం.భారతీయ సాంప్రదాయ ప్రకారం ఏదైనా గృహప్రవేశ కార్యక్రమాలలో స్త్రీలకు పెద్దపీట వేయడం జరుగుద్ది.
దాని దృష్టిలో పెట్టుకుని ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం ఈ కొత్త పార్లమెంట్ భవనంలో ఆమోదింప చేయనుందని సమాచారం.