రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను వ్యాపారవేత్తలుగా ఎదిగేలా ప్రోత్సహించాలనీ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి డిక్కీ ప్రతినిధులకు సూచించారు.గురువారం సాయంత్రం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో డిక్కీ ప్రతినిధులలో సమావేశం నిర్వహించారు.
ఎస్సీ, ఎస్టీ ల అభ్యున్నతికి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు దళిత బంధు, టి – ప్రైడ్, అంబేద్కర్ సోషల్ ఇన్నోవేషన్ స్కీం , పి ఎం ఈ జి పి వంటి అనేక పథకాలు అమలు చేస్తున్నాయన్నారు.వీటి గురించి విద్యార్థులకు తెలియజేయాలన్నారు.
వారికి ఆసక్తి ఉన్న రంగాలలో రాణించేలా శిక్షణ ఇచ్చి ప్రోత్సహించాలని చెప్పారు.సమాజానికి ఉపయోగడే కొత్త ఆవిష్కరణలు చేసే విద్యార్థులను ప్రోత్సహించాలని చెప్పారు.
ఈ సమావేశంలో రాష్ట్ర డిక్కీ ప్రెసిడెంట్ దాసరి అరుణ, రాష్ట్ర ఫోటోగ్రఫీ వర్టికల్ హెడ్ శేఖర్, రాజన్న సిరిసిల్ల జిల్లా డిక్కీ సమన్వయ కర్త ఎస్ మురళి, రంగారెడ్డి జిల్లా డిక్కీ సమన్వయ కర్త సంతోష్, ఎస్సీ కార్పొరేషన్ ఈ డి వినోద్ కుమార్ , ఎల్ డి ఎం మల్లిఖార్జున్ రావు తదితరులు పాల్గొన్నారు.