రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ( Vijay devarakonda )గీత గోవిందం మరియు అర్జున్ రెడ్డి సినిమా( Arjun Reddy Movie ) ల తర్వాత ఆ స్థాయి విజయాలను సొంతం చేసుకోలేక పోయాడు.ట్యాక్సీవాలా సినిమా తో మొదలుకుని మొన్నటి లైగర్ వరకు అనేక ఫ్లాప్స్ ను చవిచూశాడు.
దాంతో విజయ్ దేవరకొండ విషయం లో మీడియా లో ఇంకా ఇండస్ట్రీ వర్గాల్లో తక్కువ చూడటం మొదలు అయింది.ఇలాంటి సమయంలో ఖుషి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
తనకు చాలా కాలం తర్వాత సక్సెస్ దక్కిందనే సంతోషం తో ఏకంగా కోటి రూపాయల విరాళం ను విజయ్ దేవరకొండ ప్రకటించడం అందరికి ఇవ్వడం కూడా జరిగింది.అయితే రౌడీ ఫ్యాన్స్ మాత్రం ఖుషి సినిమా విషయం లో అసంతృప్తి గా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.అసలు రౌడీ ఫ్యాన్స్ ఎందుకు అసంతృప్తి గా ఉన్నారు అనే విషయానికి వస్తే.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఖుషి సినిమా వంద కోట్ల వసూళ్లు సాధిస్తుంది అనుకుంటే అంత సీన్ లేదు అన్నట్లుగా కనీసం అందులో సగం కూడా వసూళ్లు చేయలేక పోయాడు.
దాంతో ఖుషి సినిమా ( Kushi movie )విషయం లో రౌడీ ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు.పైగా సమంత( Samantha ) వల్లే ఆ వచ్చిన కలెక్షన్స్ సాధ్యం అయ్యయి అంటున్నారు.కనుక ఖుషి సినిమా సమయంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చేసిన ప్రకటన అనుసారంగా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం లో విఫలం అయ్యాడు.ముందు ముందు అయినా రౌడీ ఫ్యాన్స్ కి తగ్గట్లుగా విజయ్ దేవరకొండ ( Vijay devarakonda )భారీ విజయాలను సొంతం చేసుకుంటాడా, వందల కోట్ల వసూళ్లు నమోదు చేస్తాడా అనేది చూడాలి.
ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వం లో విజయ్ దేవరకొండ సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమా కూడా విజయాన్ని సొంతం చేసుకుంటే రౌడీ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ.