ఉత్తర కొరియా సంచలనం... ఏకంగా 10 మిసైల్స్‌ ప్రయోగం?

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్ ఉన్ ( Kimjong Un )గురించి జనాలకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఆ దేశంలో అమలు చేసే కఠినమైన ఆంక్షలతో ఇప్పటికీ అక్కడి ప్రజలు అణిచివేతకు గురవుతున్నారు అంటే అతిశయోక్తి కాదేమో.

 North Korea's Sensation 10 Missiles Launched Simultaneously , North Korea, 10 Mi-TeluguStop.com

అవును, మరోవైపు ఉత్తరకొరియాలో ఇంకా ఆకలి చావులు ఉన్నాయి.కానీ కిమ్ జోంగ్ ఉన్ మాత్రం అవేమీ పట్టనట్లు ఒక నియంత మాదిరి వ్యవహరిస్తున్నాడు.

ముఖ్యంగా న్యూక్లియర్ ఆయుధాలపై( nuclear weapons ) అతడు ఎక్కువగా దృష్టిసారిస్తున్నట్టు కనబడుతోంది.

Telugu Missiles, International, Launched, Korea, Nri, Nuclear, Kim Jong Un-Telug

అవును, ఈ నేపధ్యంలోనే తాజాగా ఉత్తర కొరియా( North Korea ) ఓ సంచలన ప్రకటన చేసింది.టాక్టికల్ న్యూక్లియర్ అటాక్ సబ్‌మెరైన్‌ను( Tactical Nuclear Attack Submarine ) తయారు చేసినట్లు తెలిపింది.అయితే 2 రోజుల క్రితమే ప్యాంగ్యాంగ్‌లో జరిగినటువంటి ఓ కార్యక్రమంలో కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా పాల్గొన్న సంగతి విదితమే.

ఇక కిమ్ ఓ షిప్ యార్డులో ఉండి సబ్‌మెరైన్‌ను పరిశీలుస్తున్నటువంటి ఫొటోను విడుదల చేసింది నార్త్ కొరియా.మరో విషయం అంటే ఈ సబ్‌మెరైన్ నుంచి అణ్వాయుధాలను కూడా ప్రయోగించవచ్చని ఉత్తరకొరియా న్యూస్ ఏజెన్సీ తెలపడం కొసమెరుపు.

Telugu Missiles, International, Launched, Korea, Nri, Nuclear, Kim Jong Un-Telug

కాగా ఈ కొత్త సబ్‌మెరైన్‌కు హీరో కిమ్ గన్-ఓకే( Kim Gun-ok ) అని నామకరణం చేశారు.అయితే దీని హల్ నెంబర్ 841.ఈ సబ్‌మెపైన్ నుంచి 2 వరసల్లో ఏకంగా 10 న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైల్స్‌ను ప్రయోగించవచ్చునట.మరో విషయం ఏంటంటే ఉక్రెయిన్‌తో యుద్ధం నేటికీ జరుగుతుండడం వలన రష్యాకు ఆయుధాల సమీకరణలు చేయాలని అనుకుంటుందట.

అందుకోసమే కిమ్ జోంగ్ ఉన్.ఆ దేశంలో పర్యటించే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పారు.ఇదిలా ఉండగా ఇటీవల అమెరికా-దక్షిణ కొరియా చేపట్టినటువంటి సంయుక్త విన్యాసాలు ముగిసిపోవడంతో నార్త్ కొరయా.పెద్ద ఎత్తున క్రూయిజ్ క్షిపణుల్ని సముద్రం పై ప్రయోగాలు చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube