కెరీర్ పరంగా ఎదిగి సక్సెస్( Success ) సాధించాలంటే సులువు కాదనే సంగతి తెలిసిందే.ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఎంతో శ్రమిస్తే మాత్రమే లక్ష్యాన్ని సాధించడం సాధ్యమవుతుంది.
సీఏపీఎఫ్ పరీక్షలో( CAPF ) ఆల్ ఇండియా స్థాయిలో 15వ ర్యాంక్ సాధించిన సయింపు కిరణ్( Saiempu Kiran ) సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని చెప్పవచ్చు.వరంగల్ జిల్లాలోని గీసుకొండ దగ్గర్లో ఉన్న అనంతారం గ్రామంలో కిరణ్ జన్మించారు.
కిరణ్ తల్లి జయలక్ష్మి, తండ్రి ప్రభాకర్ రావు వ్యవసాయ కుటుంబానికి చెందినవారు.వరంగల్ లోని( Warangal ) జవహర్ నవోదయ విద్యాలయంలో పాఠశాల విద్యను పూర్తి చేసిన కిరణ్ ప్రైవేట్ కాలేజ్ లో ఇంటర్ పూర్తి చేశారు.
ఆ తర్వాత జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో( JEE Advanced ) 1598వ ర్యాంక్ సాధించి బీటెక్ పూర్తి చేశారు.బీటెక్ తర్వాత కిరణ్ ఐఏఎస్( IAS ) లక్ష్యంగా ప్రిపరేషన్ ను మొదలుపెట్టారు.
మా కుటుంబంలో నేనే మొదటి గ్రాడ్యుయేట్ నని అమ్మానాన్న కష్టపడి చదివించడంతో వాళ్ల ప్రోత్సాహంతో ఐఐటీ ఢిల్లీ( IIT Delhi ) వరక్ వెళ్లానని కిరణ్ చెప్పుకొచ్చారు.సివిల్స్ కు( Civils ) ఢిల్లీలో మంచి ఫ్లాట్ ఫాం ఉండటంతో ఐఐటీ ఢిల్లీని ఎంపిక చేసుకున్నానని కిరణ్( Kiran ) అన్నారు.సివిల్ ఇంజనీరింగ్ పూర్తయ్యే వరకు దానిలోనే లీనమయ్యానని కిరణ్ పేర్కొన్నారు.మంచి కాలేజ్ లో చేరడం వల్ల మంచి ఫ్రెండ్స్, ఎక్స్ ఫోజర్ లభిస్తాయని కిరణ్ అన్నారు.
ఫైనల్ ఇయర్ లో ప్లేస్ మెంట్స్ కు వెళ్లకుండా సివిల్స్ ఆప్షనల్స్ కోసం కోచింగ్ తీసుకున్నానని కిరణ్ తెలిపారు.2018లో సివిల్స్ ప్రిలిమ్స్ లో క్వాలిఫై కాలేదని 2019, 2020లో ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా మెయిన్స్ మిస్ అయ్యానని ఆయన తెలిపారు.2021లో మాత్రం ఇంటర్వ్యూకు ఛాన్స్ దక్కిందని కిరణ్ పేర్కొన్నారు.ఆ తర్వాత సీఏపీఎఫ్ పరీక్ష రాసిన కిరణ్ ఈ పరీక్షలో 15వ ర్యాంక్ సాధించి తన సక్సెస్ తో ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.