దేశంలోని మహిళలలో చాలామంది టాలెంట్ ఉన్నా కుటుంబ సభ్యుల నుంచి సరైన ప్రోత్సాహం లేకపోవడం వల్ల కెరీర్ పరంగా సక్సెస్ సాధించడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.అయితే కొంతమంది మాత్రం పెళ్లి తర్వాత కూడా భార్యలను చదువు విషయంలో ప్రోత్సహిస్తూ వాళ్లు కెరీర్ పరంగా ముందడుగులు వేయడంలో తమ వంతు సహాయసహకారాలను అందిస్తుండటం గమనార్హం.
గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావూరు గ్రామానికి చెందిన షీలా భర్త ప్రోత్సాహంతో పీహెచ్డీ పూర్తి చేశారు.ఒకవైపు పిల్లల బాగోగులు చూసుకుంటూనే మరోవైపు ఆమె పీహెచ్డీ పూర్తి చేయడం గమనార్హం.ఆరోగ్య సంరక్షణ రంగంలో సేవల నాణ్యత అనే సంశంపై షీలా( Sheela ) పరిశోధనలు చేసి నేడు ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం( Acharya Nagarjuna University ) నుంచి పీహెచ్డీ అందుకోనున్నారు.షీలా పీహెచ్డీ అందుకోవడానికి డాక్టర్ నంబూరు కిషోర్ సహాయం చేశారు.
షీలా మీడియాతో మాట్లాడుతూ 2003 సంవత్సరంలో కరుణాకర్ అనే వ్యక్తితో నాకు వివాహం జరిగిందని తెలిపారు.చదువుపై నాకు ఆసక్తి ఉండటంతో నా భర్త పూర్తిస్థాయిలో సహాయసహకారాలు అందించారని ఆమె చెప్పుకొచ్చారు.
నా కొడుకు బీటెక్ చదువుతున్నడని కూతురు ఇంటర్ చదువుతోందని షీలా తెలిపారు.
మాకోసం భర్త కరుణాకర్( karunakar ) నిరంతరం శ్రమించారని నేను ఈరోజు ఏం సాధించినా నా భర్త ఘనతే అని ఆమె అన్నారు.డిగ్రీ తర్వాత ఎంకామ్, పీజీ చేశానని ఆమె చెప్పుకొచ్చారు.2016 సంవత్సరంలో ఏపీ సెట్ క్వాలిఫై అయ్యానని ఆమె కామెంట్లు చేశారు.పీహెచ్డీ అందుకోవాలన్న ఆశయం నెరవేరిందని ప్రభుత్వ అధ్యాపకురాలు కావడమే నా లక్ష్యమని షీలా చెప్పుకొచ్చారు.షీలాను ప్రోత్సహించిన భర్త కరుణాకర్ మంచి మనస్సుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
షీలా కెరీర్ పరంగా మరిన్ని సక్సెస్ లను అందుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.ప్రస్తుతం ప్రైవేట్ అధ్యాపకురాలిగా ఆమె పని చేస్తున్నారు.