శ్రీలీల లుక్స్ పై నెటిజన్స్ దారుణమైన ట్రోల్స్.. అచ్చం అవతార్ హీరోయిన్ల ఉందంటూ కామెంట్స్?

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ ని మించి దూసుకెళ్తోంది శ్రీలీల( Srileela ).ఏకంగా స్టార్ హీరోల సినిమాలతో పాటు సీనియర్ హీరోల సరసన కూడా నటిస్తుంది ఈ బ్యూటీ.

 Netizens Are Cruel Trolls On Srileelas Looks Are There Comments Saying That Ther-TeluguStop.com

చేతినిండా ప్రాజెక్టులతో ఇప్పటికే బిజీగా ఉన్న ఈ బ్యూటీ.మళ్లీ కొత్తగా వచ్చిన సినిమాలకు కూడా సైన్ చేస్తూ పోతుంది.

అన్ని సినిమాలకు కరెక్ట్ డేట్స్ ఇచ్చేసి మళ్లీ కొత్తవి కూడా సెట్ చేసుకుంటుంది.చిన్న సినిమాతో ఇండస్ట్రీకి అడుగుపెట్టిన శ్రీలీల తొలిసారి చూపులతోనే తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది.

నటన పరంగా కూడా మంచి స్కిల్స్, మంచి డాన్స్ పెర్ఫార్మెన్స్, మంచి అందం ఇలా అన్ని విషయాలలో పర్ఫెక్ట్ ఫిగర్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి దొరికింది.దీంతో రవితేజ నటించిన ధమాకా సినిమాలో అవకాశం అందుకోగా ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారింది.

ఈ సినిమా విడుదలయ్యాక చాలామంది శ్రీ లీల కోసం కూడా చూసిన వాళ్ళు ఉన్నారని చెప్పాలి.ఈ సినిమా తర్వాత శ్రీ లీలకు వరుస పెట్టి అవకాశాలు వచ్చాయి.ఏకంగా స్టార్ డైరెక్టర్లు, స్టార్ హీరోలు ఈ బ్యూటీ కి అవకాశం ఇస్తామంటూ వచ్చారు.అలా వచ్చిన వారిని నిరాశ పెట్టకుండా.అందరికీ కమిట్మెంట్ ఇచ్చేసింది ఈ బ్యూటీ.దాంతో ప్రస్తుతం తను పవన్ కళ్యాణ్, బాలయ్య, మహేష్ బాబు, నితిన్, రామ్, విజయ్ దేవరకొండ, వైష్ణవ్ తేజ్ ఇలా మరికొంతమంది స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకొని.

అన్ని సినిమాలకు డేట్స్ ఫిక్స్ చేసుకొని ఏ సినిమాకు కూడా బ్రేక్ రాకుండా వరుస పెట్టి షూటింగ్ లలో పాల్గొంటుంది.మొత్తానికి అతి తక్కువ సమయంలో తన క్రేజ్ బాగా పెంచుకుంది.

ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండటంతో అక్కడ కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఇక తనను అభిమానించే వాళ్లే కాకుండా విమర్శించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారని చెప్పాలి.అయితే ఇదంతా పక్కనే పెడితే బోయపాటి శ్రీను( Boyapati Srinu ) దర్శకత్వంలో రూపొందిన స్కంద సినిమాలో హీరో రామ్ సరసన శ్రీ లీల హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ప్రేక్షకుల ఆ వీడియో చూసి సినిమా పై భారీ అంచనాలు పెంచుకున్నారు.

అయితే కొంతమంది ఈ సినిమాలో శ్రీలీల లుక్ చూసి ట్రోల్స్ చేస్తున్నారు.బోయపాటి చేసే సినిమాల్లో హీరోయిన్స్ లుక్స్ కచ్చితంగా అలా ఉంటాయంటూ హీరోయిన్ రకుల్ ప్రీతి ఫోటోతో పాటు తన ఫోటో కూడా ఎడిట్ చేసి పెట్టారు.

అయితే అందులో శ్రీ లీల ఫేస్ చూసి దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు జనాలు.శ్రీ లీల ఏంటి ఇంత దరిద్రంగా ఉంది అని ఒకరు కామెంట్ చేయగా వెంటనే మరొకరు తను దరిద్రంగానే ఉంటుంది.

తనను బిగ్ స్క్రీన్ మీద చూడటం కష్టం అంటూ కామెంట్ చేశారు.ఇక మరొక నెటిజన్.శ్రీ లీల పిక్ లో కలర్స్ ఉన్న అవతార్ హీరోయిన్ లా ఉంది అంటూ ట్రోల్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube