చంద్రయాన్3( Chandrayaan 3 ) ప్రాజెక్ట్ సక్సెస్ కావడంతో కొత్త కొత్త ప్రశ్నలు వెలుగులోకి వస్తున్నాయి.చంద్రుని వనరులపై హక్కులు ఏ దేశానివి? అంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తుండగా శాస్త్రవేత్తలు, నిపుణులు ఆ ప్రశ్నలకు తమదైన శైలిలో సమాధానాలను ఇస్తున్నారు.జాబిల్లి మానవళి మొత్తానికి సంబంధించినది కాగా అంతర్జాతీయ చట్టాలలో కొన్ని విషయాలను స్పష్టంగా పేర్కొన్నారు.
1966 సంవత్సరం సమయంలో ఐక్యరాజ్య సమితి అంతరిక్ష పరిశోధనల కొరకు ఔటర్ స్పేస్ ట్రీటీని తీసుకొనిరాగా ఔటర్ స్పేస్ ట్రీటీ( Outer Space Treaty ) ప్రకారం చందమామపై కానీ ఇత ఖగోళ వస్తువులపై కానీ ఏ దేశమైనా సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకోకూడదు.ఖగోళ అన్వేషణ అనేది అన్ని దేశాల యొక్క ప్రయోజనం కోసం జరగాలి.ఈ ఒప్పందాలలో ప్రభుత్వ ప్రస్తావనను పొందుపరచగా ఏదైనా ప్రాంతంపై హక్కులను ప్రకటించుకోవచ్చా? లేదా? అనే ప్రశ్నలకు మాత్రం సరైన సమాధానం లేదు.
ఆ తర్వాత 1979 సంవత్సరంలో మూన్ అగ్రిమెంట్ తెరపైకి రాగా ఈ అగ్రిమెంట్ లో చందమామను తమ ఆస్తిగా వ్యక్తులు కానీ ప్రభుత్వ, ప్రభుత్వేతర, అంతర్జాతీయ సంస్థలు కానీ ప్రకటించుకోకూడదు.చందమామ, అక్కడి వనరులు ఉమ్మడి సొత్తు అని ఒప్పందం చేయగా 1984 సంవత్సరం నుంచి ఈ ఒప్పందం అమలవుతోంది.అయితే ఇప్పటికే చందమామపైకి ల్యాండర్లను పంపిన అమెరికా, చైనా, రష్యా ( America, China, Russia )మాత్రం ఈ ఒప్పందాలను ఆమోదించకపోవడం గమనార్హం.ఈ ఒప్పందాలకు కొనసాగింపుగా 2020 సంవత్సరంలో అర్టెమిస్ ఒప్పందం తెరపైకి వచ్చింది.
ఈ ఒప్పందం ప్రకారం చందమామపై సురక్షితంగా ప్రయోగాలు చేపట్టాలి.ఈ ఒప్పందంలో మన దేశం కూడా భాగస్వామిగా ఉండటం గమనార్హం.చంద్రయాన్3 సక్సెస్ తర్వాత ఇస్రో చీఫ్ సోమనాథ్ డ్యాన్స్ చేశారని ఒక వీడియో వైరల్ అవుతుండగా వైరల్ అవుతున్న వీడియో నిజం వీడియో కానీ ఆ వీడియో ఇప్పటి వీడియో కాదని సమాచారం అందుతోంది.